క్రికెట్‌లోనే కాదు.. ఏ గేమ్ లో అయినా క్రీడాస్పూర్తి చాలా అవసరం. తాము ఓడిపోతామని తెలిసి కూడా ప్రత్యర్థి జట్లకు మేలు చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. మన జట్టు సభ్యుడు చేసింది తప్పు అని భావిస్తే ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయకపోవడం క్రీడాస్పూర్తిగానే చెప్పొచ్చు. తాజాగా నేపాల్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.
ఓమన్ క్వాడ్రాంగులర్ 2021-22 సిరీస్ లో భాగంగా నేపాల్, ఐర్లాండ్ మధ్య నిన్న(ఫిబ్రవరి 14) జరిగింది. టాస్ గెలిచిన నేపాల్ జట్టు ఐర్లాండ్ కు బ్యాట్టింగ్ అప్పగించింది. ఐర్లాండ్ జట్టు బ్యాట్టింగ్ చేస్తుండగా నేపాల్ బౌలర్ కమల్ సింగ్ 19వ ఓవర్ వేయడానికి బంతి అందుకున్నాడు. ఓవర్ రెండో బంతిని ఐర్లాండ్ బ్యాట్స్‌మన్ మార్క్ అడైర్ షార్ట్ మిడ్‌వికెట్ దిశగా ఆడాడు. బంతి ఎక్కువ దూరం పోనప్పటికి సింగిల్ పూర్తి చేయొచ్చనే ఉద్దేశంతో మార్క్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న ఆండీ మెక్‌బ్రైన్‌కు కాల్ ఇచ్చాడు. అయితే బంతి కోసం పరిగెడుతూ బౌలర్ కమల్ సింగ్ ఆండీ మెక్‌బ్రైన్‌ను కింద పడేసుకుంటూ వెళ్లాడు. వెంటనే బంతిని అందుకున్న కమల్.. కీపర్ కు బాల్ విసిరాడు. ఔట్ చేసే అవకాశం వచ్చినప్పటికి నేపాల్ వికెట్ కీపర్ ఆసిఫ్‌షేక్ బెయిల్స్‌ను పడగొట్టకుండా క్రీడాస్పూర్తి ప్రదర్శించాడు. ఈలోగా ఆండీ మెక్‌బ్రైన్ సురక్షితంగా క్రీజులోకి చేరాడు. దీంతో ఆసిఫ్ క్రీడాస్పూర్తిని మెచ్చుకుంటూ ఇరుజట్ల ఆటగాళ్లు అభినందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
🏏 Spirit of cricket 🤝
Drop a ‘♥️’ below to show your appreciation for this golden gesture!
📺 Tune in to #FanCode and never miss moments like this again 👉 https://t.co/ccITeVbFiv@cricketireland @CricketNep pic.twitter.com/b4vzDyyyNU
— FanCode (@FanCode) February 14, 2022
ఇక ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ జట్టు నేపాల్‌పై 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 111 పరుగులు మాత్రమే చేయగలిగింది.