ప్రస్తుతం పాక్ లో పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ లీగ్ లో తాజాగా ఓ పాక్ ప్లేయర్ ఉల్లంఘించిన నిబంధన మాత్రం చాలా సిల్లీగా ఉంది. ఈ విషయం మీకు తెలిస్తే కచ్చితంగా నవ్వకుండా ఉండలేరు.
సాధారణంగా ఏదైన ఆటలో నిబంధనలు ఉల్లంఘిస్తే మ్యాచ్ ఫీజు లో కొత కొయ్యడమో, లేదా కొన్ని మ్యాచ్ లు ఆడకుండా నిషేధం విధించడమో జరుగుతుంది. అయితే ఎక్కువ శాతం ఆటగాళ్లు తెలియకుండా నిబంధన ఉల్లంఘిస్తుంటారు. ఇక కొందరు ప్లేయర్స్ తెలిసి మరీ ఇలా నిబంధనలు కాలరాస్తుంటారు. ఇక తాజాగా ఓ పాక్ ప్లేయర్ ఉల్లంఘించిన నిబంధన మాత్రం చాలా సిల్లీగా ఉంది. ఆ విషయం మీకు తెలిస్తే మీరు కచ్చితంగా నవ్వకుండా ఉండలేరు. ఈ సంఘటన గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో టీ20 లీగ్ లు జరుగుతున్నాయి. దాంతో కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకే ఆటగాడు రెండు ఫ్రాంఛైజీలకు ఆడాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఇక ప్రస్తుతం పాక్ లో పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ లీగ్ లో భాగంగా.. తాజాగా క్వెటా గ్లాడియేటర్స్ వర్సెస్ ముల్తాన్ సుల్తాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ లీగ్ లో గ్లాడియేటర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు స్టార్ బౌలర్నసీమ్ షా. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ నిబంధనలను ఉల్లంఘించాడు నసీమ్ షా. దాంతో అతడికి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. వివరాల్లోకి వెళితే..
పాక్ టీ20 లీగ్ లో భాగంగా క్వెటా గ్లాడియేటర్స్ వర్సెస్ ముల్తాన్ సుల్తాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ కు వచ్చిన నషీమ్ షా ధరించిన హెల్మెట్ అతడిని చిక్కుల్లో పడేసింది. పాకిస్థాన్ లీగ్ ఆడుతున్న నసీమ్ షా.. హెల్మెట్ మాత్రం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ది ధరించాడు. దాంతో పాక్ క్రికెట్ బోర్డ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు అయ్యింది. అందుకే అతడికి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. అయితే షా బంగ్లా ప్రీమియర్ లీగ్ లో కోమిల్లా విక్టోరియా ఫ్రాంఛైజీకి ప్రాతినిధ్యం వహించాడు. దాంతో అదే బ్యాగ్ ను తన వెంట తెచ్చుకుని, హెల్మెట్ ను ధరించాడు. ప్రస్తుతం నసీమ్ షా బీపీఎల్ హెల్మెట్ ధరించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దాంతో నెటిజన్లు పాక్ ఆటగాడిని ఓ ఆటాడుకుంటున్నారు. ఈ మాత్రం కూడా తెలీదా అంటూ ట్రోల్ చేస్తున్నాడు. మరి ఒక లీగ్ లో ఆడుతూ.. మరో లీగ్ హెల్మెట్ ధరించిన నసీమ్ షాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
League PSL✅
Helmet BPL🤦🏻♂️#naseemshah #BPL #PSL #Cricket pic.twitter.com/lQzkRvfGBv— Pritom (💙,🧡) (@JoyChow16122996) February 15, 2023