ఐపీఎల్ మెగా వేలంలో మన హోమ్ టీమ్ సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ కొనుగోలు చేసిన ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. SRH ఫ్యాన్స్ కూడా టీమ్ సరిగా లేదని సోషల్ మీడియా వేదికగా టీమ్ మేనేజ్‌మెంట్‌పై ట్రోల్ చేశారు. జట్టు బాగాలేదని సన్‌రైజర్స్ కోచ్ సైమన్ కటిచ్ రాజీనామా చేశాడు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో జట్టులోని ఆటగాళ్లపై ఎవరికీ అంతగా నమ్మకం లేకుండా పోయింది. వేలంలో విండీస్ ఆటగాళ్లు నికోలస్ పూరన్, షెఫర్డ్‌పై భారీ ధర పెట్టినందుకు కూడా SRH మేనేజ్‌మెంట్ విమర్శల పాలైంది. ఇషాన్ కిషన్ లాంటి ఆటగాడ్ని వదిలేసినందుకు కూడా SRH ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.
ఈ నేపథ్యంలో ఎవర్ని ఎందుకు తీసుకున్నారో?, ఎవర్ని ఎందుకు వద్దనుకున్నారో.. అనే విషయాలపై SRH బౌలింగ్ కోచ్, శ్రీలంక దిగ్గజ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ స్పందించారు. తమ ప్రణాళిక ప్రకారం టీమిండియా స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్‌ను తీసుకోవాలనుకున్నామని, కానీ తాము అనుకున్న బడ్జెట్ దాటి పోవడంతో వదిలేశామని మురళీ తెలిపారు. ఇంగ్లండ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో పూర్తి సీజన్ అందుబాటులో ఉంటాడా? అన్న విషయంపై తమకు సందేహాలుండటంతో అతని జోలికి పోలేదన్నాడు. ఈ పరిస్థితుల్లో నికోలస్ పూరన్‌ను తీసుకోవడమే బెస్ట్ అనిపించిందని చెప్పాడు. ఇక పూరన్ ఫామ్‌పై మాకు ఎలాంటి ఆందోళన లేదు. అతను మాకు మేలు చేస్తాడనే గట్టి నమ్మకంతో ఉన్నాం. అతను భారీ ధర పలకడం చూస్తుంటే.. ఇతర జట్లు కూడా పూరన్‌ను తీసుకోవాలనుకున్నాయనే విషయం అర్థమవుతోందని ముత్తయ్య మురళీధరన్ చెప్పుకొచ్చారు.
Ryt now ..,
Most Happiest Human in India 💯😅#IndvsWI #KavyaMaran #SRH #Pooran pic.twitter.com/ykDwKNA7VZ
— ɴᴏᴛ ᴘᴇʀᴍᴀɴᴇɴᴛ 👑 (@Not_Permanent_) February 16, 2022
దుమ్మురేపుతున్న SRH ఆటగాళ్లు..
వేలం తర్వాత విమర్శలు ఎదుర్కొన్న SRH ఫ్రాంచైజ్.. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తుంది. దానికి కారణం.. భారత్‌తో ఇటివల ముగిసిన టీ20 సిరీస్‌లో నికోలస్ పూరన్ హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. దాంతో అతనిపై సన్‌రైజర్స్ ఫ్యాన్స్, మేనేజ్‌మెంట్ ప్రశంసల జల్లు కురిపించింది. మూడు మ్యాచ్‌ల్లో మొత్తం 17 ఫోర్లు, 9 సిక్స్‌లతో పూరన్ 184 పరుగులు చేశాడు. అలాగే మరో యంగ్ ప్లేయర్ అబ్దుల్ సమద్ కూడా దేశవాళీ టోర్నీ రంజీల్లో దుమ్మురేపాడు. కేవలం 68 బంతుల్లోనే సెంచరీ చేసి అదరగొట్టాడు. ఇలా SRH ఆటగాళ్లు ఐపీఎల్‌కు ముందు మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. మరి SRH ప్లేయర్ల ఫామ్, ముత్తయ్య మురళీధరన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.