ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు.. ఆకలి కేకలు. తిందామంటే తిండి దొరకదు – కొందామంటే డబ్బు సరిపోదు. కిలో చికెన్ 2వేలు, కేజీ ఉల్లిపాయలు ఐదు వందలు. కనీసం గుడ్డు తిందామంటే ఒక్కోటి 50 రూపాయలపైనే. పెట్రోల్, డీజిల్ వెయ్యి పైమాటే.. ఇలా ఏదీ కొనలేని దుర్భర పరిస్థితి. కూడబెట్టిన రూపాయో.. రెండురూపాయలో.. ఇన్నాళ్లు నెట్టుకొచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. సామాన్యులు నుంచి ప్రముఖుల వరకు అందరూ.. కుటుంబాలను ఎలా నెట్టుకురావాలో తెలియక.. ప్రత్యమ్నాయ మార్గాల వైపు అన్వేషణ సాగిస్తున్నారు.
సూరజ్ రణదీవ్.. ఒకప్పుడు శ్రీలంక స్టార్ బౌలర్. ఇప్పుడు సాధారణ బస్ డ్రైవర్. సాధారణంగా.. క్రికెట్ లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లకు ఎంత ప్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో అయితే కేవలం ఆయా బోర్డులు ఇచ్చే భత్యాలపైనే ఆధారపడాల్సి ఉండేది. కానీ, ఎప్పుడైతే టీ20 లీగ్ వచ్చాయో.. సెలెక్ట్ ఆయిన ఆటగాళ్లకు కాసులపంటే పండుతోంది. ఒక్క మ్యాచ్ ఆడినా లక్షల్లో దక్కుతున్నాయి. ఆటకు వీడ్కోలు పలికాకా కూడా అవకాశాలు బోలెడు.. వ్యాఖ్యాతగా, సహాయక సిబ్బందిగా.. లేకపోతే క్రికెట్ ట్రైనింగ్ ఇస్తూనైనా సంపాదించవచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కొందరి పరిస్థితి మాత్రం దుర్భరంగా మారిందనడానికి.. సూరజ్ రణదీవే ప్రత్యక్ష ఉదాహరణ.
తన కుటుంబం కోసం డ్రైవర్ గా మారిపోయిన సూరజ్ రణవ్ లంక తరఫున 12 టెస్టులు, 31 వన్డేలు, ఏడు టీ20లు ఆడాడు. మొత్తం మూడు ఫార్మాట్లలో దాదాపు 85 వికెట్లు పడగొట్టాడు. భారత టీ20 లీగ్ లోనూ ఆడాడు. ఆకాశం ఎత్తుకు ఎదిగిన ఆటగాడు ఒక్క ఉదుటన కిందికి పడిపోయాడు. అతడి జీవితం ఎందుకు ఇలా మారిందో పూర్తి కారణాలు తెలియదు కానీ.. ఆర్థిక సంక్షోభం అతని పరిస్థితిని మరింత దిగజార్చింది.
2009లో లంక జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన సూరజ్.. 2011 వరల్డ్ కప్ జట్టులో కీలక ఆటగాడు. అయితే ధోనీ కెప్టెన్సీలో భారత్ 2011 ప్రపంచకప్ ఫైనల్లో లంకను ఓడించిన విషయం తెలిసిందే. తుదిపోరులో సూరజ్ పెద్దగా రాణించకున్నా.. ద్వైపాక్షిక సిరీసుల్లో.. అద్భుతంగా రాణించేవాడు. దీంతో.. భారత టీ20 లీగ్ ఐపీఎల్ లోకి అడుగుపెట్టే అవకాశం దక్కింది. అదీనూ ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై జట్టులో స్థానం సంపాదించాడు. చోటు సంపాదించడమే కాదు.. 2011 సీజన్ లో ఎనిమిది మ్యాచులు ఆడాడు. క్రికెట్ లో ఉన్నన్నాళ్ళు.. అంతో.. ఎంతో వెనకేసుకున్న సూరజ్ రణదీవ్.. ఉన్నవి కాస్తా అయిపోవడంతో బస్సు డ్రైవర్ గా కాలం వెళ్లదీస్తూ.. దుర్భర జీవితాన్ని గడుపుతున్నాడు. ఓడలు బళ్లు అవుతాయి.. బళ్లు ఓడలు అవుతాయంటే.. ఇదేనేమో. ఏదేమైనా.. ఒక స్టార్ క్రికెటర్ ఇలాంటి పరిస్థితులను పేస్ చేయడంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Uppal Cricket Stadium: చాలా ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో మ్యాచ్ ఆడనున్న టీమిండియా
ఇది కూడా చదవండి: Murali Vijay vs Dinesh Karthik: మ్యాచ్ మధ్యలో మురళీ విజయ్ కు చుక్కలు చూపించిన దినేష్ కార్తీక్ ఫ్యాన్స్!