హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరిగిన చాలా కాలమైంది. కరోనా పుణ్యామని ఐపీఎల్ మ్యాచ్‌లకు కూడా ఉప్పల్ స్టేడియం నోచుకోలేదు. దీంతో హైదరాబాద్ క్రికెట్ అభిమానులు స్టేడియంలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసే మజాను మిస్ అవుతున్నారు. దీంతో ఎప్పుడెప్పుడు మళ్లీ స్టేడియంలో టీమిండియా మ్యాచ్ చూస్తామా అని కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ బీసీసీఐ భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌లో భాగంగా ఒక మ్యాచ్‌ను హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో నిర్వహించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. సొంత గడ్డపై భారత జట్టు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. ఆస్ట్రేలియాతో ముందుగా 3 టీ20 మ్యాచ్‌లు ఆడే టీమిండియా... ఆ తర్వాత సఫారీ టీమ్‌తో 3 టీ20లు, 3 వన్డేలు ఆడుతుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ దాదాపుగా ఖరారు చేసింది. చాలా కాలం తర్వాత హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంకు మరో మ్యాచ్ నిర్వహణ అవకాశం లభించింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 సెప్టెంబర్ 25న ఉప్పల్‌లో జరుగుతుంది. ఈ స్టేడియంలో 2019 డిసెంబర్ 6న ఇక్కడ చివరి మ్యాచ్ (భారత్–విండీస్ టీ20) జరిగింది. సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు సెప్టెంబర్ 20న మొహాలి, 23న నాగ్‌పూర్‌లలో జరుగుతాయి. మరి చాలా కాలం తర్వాత హైదరాబాద్‌లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Schedule of India vs Australia 3-match T20I series:- (According to PTI) 1st T20I - 20th Sep in Mohali. 2nd T20I - 23rd Sep in Nagpur. 3rd T20I - 25th Sep in Hyderabad. — CricketMAN2 (@ImTanujSingh) July 21, 2022