మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ వెళ్లిన టీమిండియాకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. గత ఆదివారం ఢాకా వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పొందిన విషయం తెలిసిందే. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్‌లో వైఫల్యంతో విమర్శలు ఎదుర్కొన్న రోహిత్ సేన.. బంగ్లాదేశ్‌పై కూడా ఓడి తీవ్ర స్థాయిలో విమర్శలపాలైంది. అయితే.. పరువుతో పాటు వన్డే సిరీస్ సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా నేషనల్ స్టేడియంలో బుధవారం జరుగుతున్న రెండో వన్డేలో టాస్ ఓడి తొలుత ఫీల్డింగ్ చేస్తున్న భారత్‌కు బౌలర్లు మంచి ఆరంభాన్ని అందించారు.
ముఖ్యంగా టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఆదిలోనే బంగ్లాదేశ్ ఓపెనర్ అనుముల్ హక్‌ను అవుట్ చేసి దెబ్బతీశాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే మరో ఓపెనర్, బంగ్లా కెప్టెన్ లిట్టన్ దాస్‌ను అవుట్ చేసి ఇద్దరు ఓపెనర్లును పెవిలియన్ చేర్చాడు. సిరాజ్ తర్వాత.. ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో ఎటాక్‌లోకి వచ్చిన స్పీడ్ గన్, జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్.. బంగ్లాదేశ్‌ను గడగడలాడించాడు. తన స్పీడ్‌తో బంగ్లా మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ముప్పుతిప్పలు పెట్టాడు. డెడ్లీ బౌన్సర్లతో బాల్ ఎదుర్కొనేందుకు షకీబ్ భయపడేలా చేశాడు. తొలి ఓవర్ మెయిడెన్‌గా వేసిన ఉమ్రాన్.. తర్వాత ఓవర్ తొలి బంతికే నజ్ముల్‌ను క్లీన్ బౌల్డ్ చేసి భారత్‌కు మూడో వికెట్ అందించాడు.
అయితే.. తొలి మ్యాచ్‌లోనూ 3 వికెట్లతో రాణించిన సిరాజ్.. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ అనుముల్ హక్‌ను అవుట్ చేయడం ద్వారా అరుదైన ఘనత సాధించాడు. 2022 ఏడాదిలో టీమిండియా తరఫున 22 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 21 వికెట్లు తీసి టాప్ ప్లేస్‌లో ఉన్న స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను వెనక్కి నెట్టి.. వన్డేల్లో 22 వికెట్లతో టీమిండియా టాప్ బౌలర్‌గా నిలిచాడు. ఇక ఇదే మ్యాచ్‌లో లిట్టన్ దాస్‌ను అవుట్ చేసి సిరాజ్ తన వికెట్ల సంఖ్యను 23కు పెంచుకున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న సిరాజ్‌ను టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేయకపోవడం క్రికెట్ అభిమానుల నుంచి బీసీసీఐ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్న సిరాజ్.. ఈ ఏడాది వన్డేల్లో సైతం టీమిండియాకు మెయిన్ బౌలర్‌గా మారిపోయాడు. జస్ప్రీత్ బుమ్రా గాయంతో జట్టుకు దూరం కావడంతో టీమిండియా పేస్ ఎటాక్‌ను సిరాజ్ లీడ్ చేస్తున్నాడు.
Most wickets for India in ODI in 2022:
Siraj – 22* (14 matches)
Chahal – 21 (14 matches)— Johns. (@CricCrazyJohns) December 7, 2022
Siraj doing Ronaldo celebration again after wicket. pic.twitter.com/myjUc3Zu1q
— ” (@Sobuujj) December 7, 2022