భారత పేసర్లు మరోసారి సత్తా చాటారు. టెస్టుల్లో స్పిన్‌ను ఆస్ట్రేలియా పనిపట్టిన టీమిండియా.. వన్డేల్లో పేస్ వణికించింది. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆస్ట్రేలియాను 188కు ఆలౌట్ చేసింది. అయితే.. షమీ సూపర్ స్పెల్‌తో అదరగొట్టాడు.
ముంబైలోని వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత పేసర్లు నిప్పులు చెరిగారు. పటిష్టమైన ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌ను కేవలం 188 పరుగులకే కుప్పకూల్చారు. ముఖ్యంగా షమీ-సిరాజ్ జోడీ ఆస్ట్రేలియాను వణికించింది. 5.4 ఓవర్లు వేసిన సిరాజ్ 29 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. షమీ 6 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు. వీరిద్దరికి జడేజా రెండు వికెట్లతో మంచి సపోర్ట్ ఇచ్చాడు. హార్దిక్, పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు.
అయితే.. షమీ వేసిన 6 ఓవర్లలో రెండు మెయిడెన్ ఓవర్లు వేశాడు. అలాగే.. చివరి 14 బంతుల్లో ఒక్కటంటే ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. పైగా మూడు వికెట్లు తీసుకుని అద్భుత స్పెల్ వేశాడు. షమీ దెబ్బకు జోష్ ఇంగ్లిస్, కామెరున్ గ్రీన్, స్టోయినీస్ పెవిలియన్ చేరారు. మూడుకి మూడు మంచి వికెట్లే. నిలబడితే మ్యాచ్‌ను తలకిందులు చేసే ఆటగాళ్లే. వారినే షమీ వణికించాడు. ముఖ్యంగా కామెరున్ గ్రీన్‌ను అవుట్ చేసిన విధానం అయితే మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. షమీ పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌కు పూర్తిగా బీట్ అయిన గ్రీన్.. వికెట్ సమర్పించుకున్నాడు. షమీ స్పీడ్‌కు వికెట్ ఎగిరి అవతల పడింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత ఫీల్డింగ్ చేసేందుకు నిర్ణయించాడు. పాండ్యా నిర్ణయం సరైందేనని భారత పేసర్లు నిరూపించారు. తన తొలి ఓవర్‌లోనే సిరాజ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ మిచెల్ మర్ష్, కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో కలిసి కొద్ది సేపు ఆడి 50 ప్లస్ పార్ట్నర్ షిప్‌ను నమోదు చేసిన తర్వాత స్మిత్‌ను పాండ్యా అవుట్ చేశాడు. కొద్దిసేపటికి మిచెల్ మార్ష్, లబుషేన్‌ను జడేజా, కుల్దీప్ యాదవ్ వెంటవెంటనే అవుట్ చేయడంతో ఆసీస్ 139 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఇక ఇక్కడి నుంచి షమీ ఆసీస్‌ను కోలుకోకుండా చేశాడు. షమీ-సిరాజ్ దెబ్బకు ఆస్ట్రేలియా 188 పరుగులకు ఆలౌట్ అయింది. 189 పరుగుల లక్ష్యంతో టీమిండియా ఓపెనర్లు బరిలోకి దిగారు. మరి ఈ మ్యాచ్‌లో షమీ బౌలింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shami in the last 14 balls:
W, 0, 0, 0, W, 0, 0, 0, 0, 0, W, 0, 0, 0.
— Johns. (@CricCrazyJohns) March 17, 2023
A dream delivery for a fast bowler. Mohammed Shami ❤️👏#INDvsAUS #INDvAUS pic.twitter.com/qM13vf23f2
— Drink Cricket 🏏 (@Abdullah__Neaz) March 17, 2023