క్రికెట్ అంటేనే జెంటిల్‌మెన్ గేమ్. ఈ ఆటలో ఆటగాళ్లు చాలా క్రమశిక్షణతో మెలుగుతారు. అలాంటి ఆటకే మచ్చతెచ్చేలా ప్రవర్తించాడు అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ మొహమ్మద్ షహజాద్. క్రికెట్ మైదానంలో సిగరేట్ తాగి కెమెరా కంటికి చిక్కి విమర్శల పాలయ్యాడు. అతని ప్రవర్తనతో ఆగ్రహించిన అధికారులు షహజాద్‌ను మందలించారు. ఈ సంఘటన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా శుక్రవారం ఢాకాలోని షేర్ ఏ బంగ్లా నేషనల్ స్టేడియంలో చోటు చేసుకుంది. శుక్రవారం కొమిల్లా విక్టోరియన్స్, మినిస్టర్ గ్రూప్ ఢాకా జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఆటగాళ్లు మైదానంలోకి వచ్చారు.
ఆ సమయంలో షహజాద్ ఎలక్ట్రానిక్ సిగరేట్ తాగుతూ కనిపించాడు. సహచార ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి తాగమని చెప్పిన వినకుండా మైదానంలోనే సిగరేట్ తాగాడు. దీంతో అతను సిగరేట్ తాగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరికి షహజాద్ తన తప్పు అంగీకరించడంతో అతన్ని మందలించి వదిలేసినట్లు బీసీఎల్ నిర్వాహకులు తెలిపారు. అలాగే అతనికి డీమెరిట్ పాయింట్లు కేటాయించినట్లు పేర్కొన్నాడు. మరి షహజాద్ గ్రౌండ్‌లో సిగరేట్ తాగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Afgan Batter Mohammad Shahzad Was Seen With Cigarette During Rain Break Of Today’s #bplt20 Match.
Hmm, Shouldn’t Do It Publicly, Gives A Bad Sight pic.twitter.com/7gBB5A62me
— বাংলার ছেলে 🇧🇩 (@iSoumikSaheb) February 4, 2022