క్రికెట్ అంటేనే జెంటిల్‌మెన్ గేమ్. ఈ ఆటలో ఆటగాళ్లు చాలా క్రమశిక్షణతో మెలుగుతారు. అలాంటి ఆటకే మచ్చతెచ్చేలా ప్రవర్తించాడు అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ మొహమ్మద్ షహజాద్. క్రికెట్ మైదానంలో సిగరేట్ తాగి కెమెరా కంటికి చిక్కి విమర్శల పాలయ్యాడు. అతని ప్రవర్తనతో ఆగ్రహించిన అధికారులు షహజాద్‌ను మందలించారు. ఈ సంఘటన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా శుక్రవారం ఢాకాలోని షేర్ ఏ బంగ్లా నేషనల్ స్టేడియంలో చోటు చేసుకుంది. శుక్రవారం కొమిల్లా విక్టోరియన్స్, మినిస్టర్ గ్రూప్ ఢాకా […]