వన్డేల్లో ప్రమాదకర జట్టుగా మారిన బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్ లో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ మీద సంచలన విజయం సాధించింది. తద్వారా గత 89 ఏళ్లలో అతి పెద్ద విజయాన్ని అందుకొని చరిత్ర సృష్టించింది.
టెస్టు క్రికెట్ లో బంగ్లాదేశ్ ఇప్పుడు పసికూన జట్టు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆ జట్టు అత్యున్నత అట తీరు ప్రదర్శిస్తూ సంచలనాల విజయాలను అందుకుంటుంది. ముఖ్యంగా సొంత గడ్డ బంగ్లా మీద టెస్టు మ్యాచ్ ఆడేటప్పుడు తక్కువగా అంచనా వేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. గతంలో ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టుని కూడా బంగ్లాదేశ్ ఓడించిన సంగతి తెలిసిందే. ఇక తమ కన్నా చిన్న జట్లు బంగ్లాదేశ్ మీద ఆడితే ఇంకేమైనా ఉందా.. చిత్తుగా ఓడడం గ్యారంటీ. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన తొలి టెస్టులో భారీ విజయాన్ని నమోదు చేసింది. అంతేకాదు గత 89 ఏళ్లలో ఇదే పెద్ద విజయం కావడం విశేషం.
వన్డేల్లో ప్రమాదకర జట్టుగా మారిన బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్ లో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ మీద సంచలన విజయం సాధించింది. డాకా వేదికగా జరిగిన ఏకైక టెస్టులో ఏకంగా 546 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది . తద్వారా గత 89 ఏళ్లలో అతి పెద్ద విజయాన్ని అందుకొని చరిత్ర సృష్టించింది. 21వ శతాబ్దంలో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం కావడం గమనార్హం. 662 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్..115 పరుగులకే కుప్పకూలింది. మొత్తంగా టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా మూడో అతి పెద్ద విజయం కాగా 21వ శతాబ్దంలో ఇంత భారీ తేడాతో గెలవడం ఇదే తొలిసారి.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 382 పరుగులకు ఆలౌట్ అయింది. నజ్ముల్ శాంటో (146) సెంచరీతో చెలరేగగా.. మహ్మదుల్ హసన్ జాయ్ (76), మోహిది హాసన్ (48) రాణించారు. ఆ తర్వాత బంలా బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్ లో అఫ్గాన్..కేవలం 146 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో బంగ్లా జట్టుకి 236 పరుగుల ఆధిక్యం దక్కగా.. రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కోల్పోయి 425 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో కూడా శాంటో (124) సెంచరీ చేయడం గమనార్హం. శాంటోతో పాటుగా కెప్టెన్ మోమినుల్ హక్ (121) కూడా సెంచరీ చేశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో అఫ్గాన్ ఎదుట 661 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్ మాదిరిగానే ఏ మాత్రం పోరాడకుండా 115 పరుగులకే ఆలౌట్ అయింది. మొత్తానికి భారీ విజయాన్ని సాధించి సరి కొత్త రికార్డ్ సృష్టించింది బంగ్లాదేశ్. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
HISTORY – Bangladesh beat Afghanistan by 546 runs in the Test Match.
This is the Biggest win in terms of runs in 21st century and third biggest wins in the history of Test Cricket. pic.twitter.com/Qi3pjW55a7
— CricketMAN2 (@ImTanujSingh) June 17, 2023