టీ20 వరల్డ్ కప్ 2021ను ఆస్ట్రేలియా గెలిచిన విషయం తెలిసిందే. అలాగే ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. గతంలో కూడా వార్నర్ అద్భుతమైన ఇన్సింగ్స్‌లు ఆడి ఆస్ట్రేలియాకు మంచి విజయాలను అందించాడు. కానీ ఈ సారి అతని ప్రదర్శన కొంత ప్రత్యేకతను సంతరించుకుంది. దానికి కారణం ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ మెనేజ్‌మెంట్ వార్నర్ పట్ల వ్యవహరించిన తీరు. ఐపీఎల్ 2021 సీజన్‌లో వార్నర్ ఫామ్‌లో లేడని అతన్ని ఏకంగా జట్టు నుంచే తొలగించారు. ఈ నిర్ణయంపై ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ కూడా మండిపడ్డారు.
ఆ జట్టుకు కెప్టెన్‌గా ఎన్నో విజయాలు అందించిన ఆటగాడికి ఇచ్చే గౌరవం ఇదా అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఇక ఐపీఎల్ ముగిసిన వెంటనే మొదలైన టీ20 వరల్డ్ కప్‌లో వార్నర్ అదరగొట్టాడు. ఏకంగా మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు మొహమ్మద్ కైఫ్.. ‘జీవితంలోలానే ఆటలో కూడా ఎప్పుడు గివ్‌అప్ చెప్పొద్దని. కొన్ని వారాల క్రితం ఐపీఎల్‌లో తన జట్టు తరపున మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయిన వార్నర్.. టీ20 వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడని. కొన్ని సార్లు సన్‌రైజ్ కొంత ఆలస్యంగా అవుతుందని‘ అన్నాడు. వాస్తవానికి వార్నర్‌కు మరికొంత సమయం ఇచ్చి.. ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం సన్‌రైజర్స్ టీమ కల్పించాల్సిందనే వాదన ఉంది. దీన్ని ఇప్పుడు కైఫ్ ఉదహరిస్తూ.. సన్‌రైజ్ కొన్ని సార్లు ఆలస్యం అవుతేందే గానీ ఆగిపోదని చెప్పినట్లు అర్థం అవుతోంది.
ఇదీ చదవండి: విమర్శకుల నోరు మూయించిన వార్నర్.. శుభాకాంక్షలు తెలిపిన భార్య
In sports, like in life, never ever give up. In just a few weeks, David Warner went from not being good enough for his IPL team to Player of 2021 T20 World Cup. Sometimes Sunrises a bit late. pic.twitter.com/chiXGQuBrX
— Mohammad Kaif (@MohammadKaif) November 15, 2021