టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్ లో సత్తా చాటిన ఆస్ట్రేలియా తొలిసారిగా కప్ ను ఎగరేసుకుపోయింది. అయితే ఆదివారం దుబాయి వేదికగా ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ ఫైనల్ లో తలపడి ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో ముందుగా బ్యాంటింగ్ దిగిన న్యూజీలాండ్ 20 ఓవర్లకు 173 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ముందు ఉంచింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించి కప్ ను ముద్దాడింది. అయితే ఈ టోర్నమెంట్లో వార్నర్ అద్భుతమైన ప్రదర్శనను కనబరిచి మ్యాన్ ఆఫ్ సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఐపీఎల్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో వార్నర్ గతంలో కీలక ఆటగాడిగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో 2021 ఐపీఎల్ లో SRH టీమ్ వార్నర్ ఫామ్ లేడని ప్లేయింగ్ ఎలవెన్ లో చోటు ఇవ్వలేదు. అయితే దీనిని ఉధ్దేశించి డేవిడ్ వార్నర్ భార్య టీ20 వరల్డ్ కప్ లో భాగంగా వార్నర్ సత్తా చాడటంతో భర్తకు శుభాకాంక్షలు తెలపటంతో పాటు ‘లాస్ట్ టచ్’, ‘ఎండ్ ఆఫ్ వార్నర్’, ‘టూ ఓల్డ్’ జిబ్స్‌తో వ్యంగంగా ట్వీట్ చేసింది. ఖచ్చితంగా SRH టీమ్ ను ఉద్దేశించే ట్వీట్ చేసిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏదేమైన SRH టీమ్ వార్నర్ ను తక్కువ అంచనా వేయటంతో తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు. ఈ దెబ్బతో వార్నర్ ను SRH టీమ్ లోకి మళ్లీ తీసుకోబోతున్నారా తీసుకోరా అనేది తెలియాల్సి ఉంది.
Out of form, too old and slow! 😳🤣 congratulations @davidwarner31 pic.twitter.com/Ljf25miQiM
— Candice Warner (@CandiceWarner31) November 14, 2021