టీమిండియా మజీ కెప్టెన్, ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్ ఇంటి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అజహర్ తండ్రి మొహమ్మద్ యూసుఫ్ మరణించారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న యూసుఫ్.. బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మరణంతో అజహర్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. రేపు బంజార హిల్స్‌లో మధ్యాహ్నం జోహర్ నమాజ్ తర్వాత ఆయన ఖనన కార్యక్రమాలు చేయనున్నట్లు సమాచారం.
కాగా.. అజహరుద్దీన్ కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అవుటర్ రింగ్‌రోడ్డుపై స్పోర్ట్స్ బైక్ యాక్సిడెంట్‌లో ఆయన మృతిచెందారు. కాగా.. ఇటివల ఉప్పల్‌లో జరిగిన భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ టిక్కెట్ల విషయంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కేసు కూడా నమోదైంది. కాగా.. అజహరుద్దీన్ టీమిండియా కెప్టెన్‌గా ఉన్న సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలో జట్టు దూరమయ్యారు. ఆయన నిషేధం కూడా ముగిసింది. కాగా.. అజహరుద్దీన్ హెచ్‌సీఏకి ప్రెసిండెంట్‌తో పాటు కాంగ్రెస్ పార్టీలోనూ యాక్టివ్ నేతగా ఉన్నారు.
Former cricketer of Indian cricket team and president of Hyderabad Cricket Association (HCA) Mohammad Azharuddin father Muhammad Yusuf passed away. #IndianCricketTeam @BCCI pic.twitter.com/TbBUd8UKoK
— DONTHU RAMESH (@DonthuRamesh) October 18, 2022