వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీ రద్దు చేస్తున్నట్లు దేశం అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రకటన చేసింది. ఆధిపత్య పోరు కోసం నిత్యం ఒకరిపై మరొకరు ఆరోపణలకు దిగుతుండడం, మ్యాచుల నిర్వహణ ఆశించిన స్థాయిలో నిర్వహించలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
క్రికెట్‌లో ఎవరు బెస్ట్ బ్యాట్స్‌మన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఆల్‌రౌండర్ అనే చర్చలు ఎప్పుడూ జరుగుతుంటాయి. ముఖ్యంగా అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఎవరనేది ప్రేక్షకులతో పాటు క్రికెట్ విశ్లేషకులు, మాజీ ప్లేయర్లు కూడా డిస్కస్ చేస్తుంటారు. ఇతడండే ఇతడే బెస్ట్ బ్యాట్స్‌మన్ అంటూ కితాబిస్తుంటారు. బ్యాటింగ్‌లో చేసిన పరుగులు, ఆడిన మ్యాచులను బట్టి ఎవరు అత్యుత్తమో చెబుతుంటారు. ప్రస్తుత క్రికెట్‌లో ఈ లిస్టులో ఇద్దరు, ముగ్గురు ప్లేయర్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ తరంలో విరాట్ కోహ్లీ, జో రూట్, […]
టీమిండియా మజీ కెప్టెన్, ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్ ఇంటి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అజహర్ తండ్రి మొహమ్మద్ యూసుఫ్ మరణించారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న యూసుఫ్.. బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మరణంతో అజహర్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. రేపు బంజార హిల్స్‌లో మధ్యాహ్నం జోహర్ నమాజ్ తర్వాత ఆయన ఖనన కార్యక్రమాలు చేయనున్నట్లు సమాచారం. కాగా.. అజహరుద్దీన్ కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అవుటర్ […]
India vs Australia 3rd T20: హైదరాబాద్, ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం భారత్ – ఆస్ట్రేలియా చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. అష్టకష్టాలు పడి మ్యాచ్ టికెట్లు దక్కించుకున్న వారికి స్టేడియంలో సమస్యలు స్వాగతం పలకనున్నాయి. మ్యాచ్కు కేవలం ఘనత సమయమే మిగిలి ఉన్నప్పటికీ ఏర్పాట్లు చేయడంలో హెచ్సీఏ ఘోరంగా విఫలమైంది. స్టేడియం లోపల ఎటు చూసినా విరిగిపోయిన ఛైర్లు, దుమ్ము పట్టిన కుర్చీలే కనిపిస్తున్నాయి. ఒకవేళ బాగున్నా, వాటిపై పావురాల రెట్టలు దర్శనమిస్తున్నాయి. ఉప్పల్ […]
ఉప్పల్ వేదికగా జరగనున్న భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ కు రాజకీయ రంగు పులుముకుంది. ఆఫ్ లైన్ టికెట్ల కోసం జనాలు వేలాది సంఖ్యలో జింఖానా గ్రౌండ్స్ కు తరలిరావడం, అది కాస్తా తొక్కిసలాటకు దారితీయడంతో ఈ చర్చ మొదలైంది. ఈ తొక్కిసలాటలో సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికే.. ఈ విషయంపై సుప్రీం కోర్టు హై లెవెల్ కమిటీని కూడా నియమించింది. తాజాగా, ఈ విషయంపై మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ […]
ఉప్పల్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్న భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గురువారం నాడు జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో సుప్రీంకోర్టు హైలెవెల్ కమిటీ వేసింది. ఈ క్రమంలో మ్యాచ్ నిర్వహణపై, మాజీ చీఫ్ జస్టిస్ కక్రూ, తెలంగాణ ఏసీపీ డీజీ అంజనీ కుమార్, భారత మాజీ క్రికెటర్ వెంకటపతిరాజులతో హైలెవల్ కమిటీ రివ్యూ మీటింగ్ నిర్వహించింది. ఆ వివరాలు.. ఉప్పల్ స్టేడియంలో సుమారు మూడేళ్ల […]
మన ఇండియాలో క్రికెట్‌కున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మ్యాచ్ వీక్షించడం కోసం ఎంత దూరమైన వెళ్తారు అభిమానులు. ఇక టిక్కెట్ల కోసం పడిగాపులు కాస్తారు. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. హైదరాబాద్ వేదికగా ఈ నెల 25న జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా ఆఖరి టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకం తీవ్ర గందరగోళానికి దారితీసింది. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో టీ20 టికెట్లు అమ్మకం నిర్వహించిన సంగతి తెలిసిందే. టిక్కెట్లు దక్కించుకోవడానికి వేల సంఖ్యలో పరిమితికి […]
క్రీడా ప్రపంచంలో గెలుపోటములు సహజమే. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని రాబోయే రోజుల్లో వాటిని విజయాలుగా మార్చుకోవడమే నిజమైన విజేతల గొప్ప లక్షణం. అయితే అప్పుడప్పుడు కొన్ని పరాజయాలు పలకరించడం సహజం. ఈక్రమంలో కొన్ని విమర్శలను సైతం ఎదుర్కొవాల్సి వస్తుంది. ప్రస్తుతం అలాంటి విమర్శలే భారత మహిళల క్రికెట్ జట్టు ఎదుర్కొంటోంది. కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా క్రికెట్ లో భారత మహిళ జట్టు ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఓ మాజీ దిగ్గజ క్రికెటర్ చేసిన […]