టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం బ్యాడ్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2022లో ఒకటి రెండు మ్యాచ్‌లు మినహా.. టోర్నీ అంతా విఫలం అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కీలకమైన క్వాలిఫైయర్ 2లో కూడా 8 బంతులాడి కేవలం 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోవడంతో ఐపీఎల్ 2022లో వారి ప్రస్థానం ముగిసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాగ్ కోహ్లీ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించే వ్యాఖ్యలు చేశాడు. ‘విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడింది చాలు కానీ.. బ్యాగ్ సర్దుకుని కొంత రెస్ట్ తీసుకోవాలి.. తన బ్యాట్‌ను ఇక బ్యాగ్‌లో సర్దుకోవాలి’ అని సూచించాడు.
కాగా వాగ్ కామెంట్స్‌పై కోహ్లీ ఫ్యాన్స్ ఒక రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. విరాట్ కోహ్లీ సామర్థ్యాన్ని ఒక ఐపీఎల్ సీజన్‌ను డిసైడ్ చేయలేదని గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. టన్నులుకొద్ది పరుగులు చేసిన ఆటగాడి గురించి మాట్లాడేముందు ఆలోచించాలని హితవు పలుకుతున్నారు. ఒక్క సీజన్‌లో విఫలం అయితేనే కోహ్లీని ఇన్నీ ఉచిత సలహాలు ఇచ్చేవాళ్లు.. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు, ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డులు ఇంకా కోహ్లీ పేరిటే ఉన్నాయని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. ఐపీఎల్ 2022లో 16 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 22.73 సగటుతో 341 పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఈ గణాంకాలు టీమిండియా ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ కంటే ఎక్కువ డబ్బులు పొందిన ఆటగాళ్ల కంటే ఎక్కువని కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు. తనపై మేనేజ్‌మెంట్ నుంచి ఎలాంటి ఒత్తిడి లేకున్నా కూడా ఆర్సీబీ కెప్టెన్సీని కోహ్లీ త్యాగం చేశాడని జట్టు కోసం కోహ్లీ ఏం చేయడానికైనా, ఎంతటి త్యాగానికైన వెనకడుగు వేయడనే విషయాన్ని మర్చిపోవద్దని అంటున్నారు. కాగా.. కోహ్లీ విరామంలేని క్రికెట్‌తో చాలా అలిసిపోయాడని.. అందుకే కొంత రెస్ట్ తీసుకుని, రీఫ్రెష్ అయి బరిలోకి దిగాలని వాగ్ సూచించినట్లు మరికొంత మంది ఫ్యాన్స్ వాగ్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virat Kohli: బట్లర్ మరో సెంచరీ కొట్టినా.. కోహ్లీ రికార్డును టచ్ కూడా చేయలేడు!