టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం జట్టుకు దూరంగా విశ్రాంతిలో ఉన్నాడు. కొన్ని నెలలుగా సరైన ఫామ్‌లో లేక పరుగులు చేయడానికి కోహ్లీ ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ బ్యాడ్‌ఫేజ్ నుంచి బయటపడేందుకు కోహ్లీ వెస్టిండీస్, జింబాబ్వే టూర్లకు దూరంగా ఉన్నాడు. జింబాబ్వే టూర్ తర్వాత ప్రారంభ కానున్న ఆసియా కప్‌తో కోహ్లీ తిరిగి టీమిండియాలోకి రానున్నాడు.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాగ్ విరాట్ కోహ్లీ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో దిగ్గజాలైన ఆస్ట్రేలియా మాజీ దివంగత క్రికెటర్ డాన్ బ్రాడ్‌మ్యాన్, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియన్ లారా, టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌ల కంటే వన్డేల్లో విరాట్ కోహ్లీ బెటర్ అంటూ కామెంట్ చేశాడు. ఈ విషయంపై క్రికెట్ అభిమానులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
విరాట్ కోహ్లీ ప్రస్తుతం క్రికెట్‌లో గొప్ప ఆటగాడే కావచ్చు కానీ.. డాన్, లారా, సచిన్ లాంటి దిగ్గజలా కంటే బెటర్ అనడం సరికాదని అంటున్నారు. కాగా విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 262 వన్డేలు 57.68 సగటుతో ఆడి 12,344 పరుగులు చేశాడు. అందులో 43 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే సచిన్ టెండూల్కర్ 463 వన్డేలు ఆడి 44.83 సగటుతో 18,426 పరుగులు చేశాడు. అందులో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇక బ్రియన్ లారా 299 వన్డేల్లో 40.48 సగటులో 10,405 పరుగులు చేశాడు. అందులో 19 సెంచరీలు 63 అర్ధసెంచరీలు ఉన్నాయి. కాగా ప్రపంచలోనే ఆల్‌టైమ్ దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన డాన్ బ్రాడ్‌మ్యాన్ 99.94 సగటుతో బ్యాటింగ్ చేసిన రికార్డు ఉంది. ప్రపంచ క్రికెట్‌లో ఇలాంటి బ్యాటింగ్ యావరేజ్ మరే క్రికెటర్‌కు లేదు. మరి మైఖేల్ వాగ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.