తొలి టెస్టులో జట్టు దారుణ ప్రదర్శనతో ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ ఆరంభానికి ముందు పిచ్‌పై, తాజాగా జడేజా గురించి అర్థం లేని వ్యాఖ్యలతో రోత పుట్టిస్తున్నారు. తాజాగా ఆసీస్ మాజీ కెప్టెన్ సైతం అనవసరపు వివాదంలో ఓ మాట పడేశాడు.
క్రికెట్లో విమర్శలు, వివాదాలు చాలా సహజం. ముఖ్యంగా భారత్-పాక్, ఆస్ట్రేలియా -భారత్ మధ్య మ్యాచ్ లు జరిగితే.. ఇలాంటి గొడవలు, విమర్శలు కామన్‌గా వినిపిస్తూ ఉంటాయి. పాకిస్థాన్ తో ఎప్పుడైతే మన వాళ్ళు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం ఆపేశారో అప్పటి నుండి అందరి దృష్టి ఆస్ట్రేలియా -భారత్ జట్ల వైపుకి మళ్లింది. కామెంటేటర్స్ నుండి మాజీల వరకు ఎవరో ఒకరు వారి అభిప్రాయాలను, వారి విశ్లేషణను చెబుతూ ఉంటారు. వీటిలో కొన్ని విమర్శలకు దారి తీస్తుంటాయి. ఇలాంటి వారిని నెటిజన్స్ సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం కూడా కామన్ గా మారిపోయింది. ఇక “బోర్డర్-గవాస్కర్” ట్రోఫీలో అయితే వీటి తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంటుంది.
తొలి టెస్టు తొలి రోజు ఆటలో భాగంగా జడేజా వేలికి ఆయింట్మెంట్ రాసుకుంటూ కనిపించాడు. దీనిపై ఆస్ట్రేలియా మీడియా బాల్ టాంపరింగ్ అంటూ గగ్గోల పెట్టడం చకచకా జరిగిపోయింది. కానీ.., జడేజా వైపు నుండి ఎలాంటి తప్పు లేకపోవడంతో వీరంతా సైలెంట్ అయిపోయారు. అయితే.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఇప్పుడు ఈ విషయంలో అనవసర కామెంట్స్ చేసి.. నెటిజన్స్ కి బుక్ అయిపోయాడు. క్లార్క్ మాట్లాడుతూ.. “బహుశా జడేజాకు ఏదో గాయం అయినట్టుగా వుంది. ఆ సమయంలో ఒక చేతితో బంతి ని పట్టుకుంటూ, మరొక చేతితో ఆయింట్మెంట్ రాసుకుంటూ కనిపించాడు. అయితే.. ఆ సమయంలో జడేజా అలా చేసి ఉండకూడదు. అతను ఆయింట్మెంట్ రాసుకునేటప్పుడు బంతిని అంపైర్ చేతికి ఇచ్చి ఉండాల్సింది. నేను చేసిన ఈ వ్యాఖ్యలు 100 శాతం కరెక్ట్ అనుకోవట్లేదు” అని విమర్శలు చేస్తూనే.. ఒకింత అనుమానం వ్యక్తం చేశాడు.
నిజానికి ఈ విషయంలో జడేజా నుండి ఎలాంటి తప్పు లేదు. ఈ విషయం తేలిపోయాక కూడా క్లార్క్.. విచిత్ర వాదన తెరపైకి తేవడం ఆశ్చర్యంగా మారింది. అయితే.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారత్ తో సిరీస్ అంటే ఇలా మాట్లాడడం సహజమే. భారత్ ఏం చేసినా.. చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తారు. ఇప్పుడు క్లార్క్ కూడా అలాగే చేసి ఉంటాడు అని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ క్లార్క్ వ్యాఖ్యలను లైట్ తీసుకుంటున్నారు. ఇక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టులో జడేజా అదరగొడుతున్న సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లతో చెలరేగిన జడేజా.. ఆ తర్వాత బ్యాటింగ్ లో కూడా అర్ధ సెంచరీతో మెరిశాడు. మరి.. ఆస్ట్రేలియా మాజీలు జడేజాని ఇలా టార్గెట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Former Australian captain Michael Clarke has his on Ravindra Jadeja’s ball tempering controversy.#Cricket #cricketnews #CricketAustralia #INDvsAUS #RavindraJadeja #TeamIndia #IndianCricketTeam @imjadeja pic.twitter.com/a0zxBVERFU
— CricInformer (@CricInformer) February 10, 2023