ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన T20 లీగ్ ఏదంటే.. అందరూ చెప్పే పేరు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL). ఈ లీగ్ రాకతో క్రికెట్ ఆడే దేశాల్లో స్థానికంగా అనేక టీ20 లీగ్స్ పుట్టుకొచ్చాయి. బిగ్‌బాష్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, బంగ్లా ప్రీమియర్ లీగ్, శ్రీలంక ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్.. ఇలా ఒక్కటేమిటి చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో యూఏఈలో కూడా టీ20 లీగ్ ఏర్పడింది. ఇందులోకి ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ వెళ్లింది. త్వరలో ప్రారంభం కానున్న యూఏఈ టీ20 క్రికెట్ లీగ్‌లో రిలయన్స్ గ్రూప్.. ఫ్రాంచైజ్‌లను కొనుగోలు చేసింది. యూఏఈ లీగ్‌లోని ఆరు జట్లలో ఒక టీమ్ ను రిలయన్స్ గ్రూప్ సొంతం చేసుకుంది. తాజాగా ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్టు సభ్యులను రిలయన్స్ గ్రూప్ పరిచయం చేసింది.
యూఏఈ ఇంటర్నేషనల్ టీ20 లీగ్ కోసం MI ఎమిరేట్స్ జట్టు తరపున ఆడబోయే ఆటగాళ్లను ముంబై ఇండియన్స్ పరిచయం చేసింది. పాత, కొత్త ఆటగాళ్ల కలయికతో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ లీగ్ లో అడుగుపెట్టనున్నట్లు తెలిపింది. తాజాగా ముంబై ఇండియన్స్ యాజమాన్యం పరిచయం చేసిన MI ఎమిరేట్స్ సభ్యులు:
పోలార్డ్(వెస్టిండీస్), బ్రావో(వెస్టిండీస్), నికోలస్ పూరన్(వెస్టిండీస్), బౌల్ట్(న్యూజిలాండ్), ఫ్లెచర్(వెస్టిండీస్), ఇమ్రాన్ తాహిర్(సౌతాఫ్రికా), సమిత్ పటేల్ (ఇంగ్లాడ్) , విల్ స్మీడ్(ఇంగ్లాడ్), జోర్డాన్ థామ్సన్(ఇంగ్లాడ్), నిజబుల్హా జోర్ధార్ (ఆఫ్ఘనిస్తాన్), జహీర్ ఖాన్(ఆఫ్ఘనిస్తాన్), ఫజల్ హుక్(ఆఫ్ఘనిస్తాన్), బ్రాడ్లే(స్కాట్లాండ్), లీడ్ (నెదర్లాండ్).
వీరందరూ లీగ్ మార్గదర్శకాల ప్రకారం సంతకం చేశారని, భవిష్యత్తులో UAE నుండి స్థానిక ఆటగాళ్లు MI జట్టులో వస్తారని ముంబై ఇండియన్స్ యాజమాన్యం తెలిపింది. మరి.. తాజాగా ముంబై ఇండియన్స్ ప్రకటించిన MI ఎమిరెట్స్ జట్లు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Representing @MIEmirates at the IL T20 🇦🇪
Read more – https://t.co/XjRmpaAoEl#MIemirates #OneFamily @EmiratesCricket pic.twitter.com/V5nbQWD0FJ
— MI Emirates (@MIEmirates) August 12, 2022