భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ముంబై రంజీ జట్టుతో ఉండే అనుబంధం ఏనాటిదో. క్రికెట్ దేవుడు పరిచయం అయ్యిందే.. ముంబై డొమెస్టిక్ టీం వల్ల. కానీ, అతని కొడుకు అర్జున్ టెండూల్కర్ మాత్రం అది కలిసి రావడం లేదు. దేశవాళీలో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్‌కు చెప్పుకోదగ్గ అవకాశాలు రావడం లేదు. ఈ క్రమంలో ముంబై జట్టుతో తెగదెంపులు చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈ మేరకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం బోర్డుకు అప్లై చేశాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కొడుకు అనే ట్యాగ్ లైన్ అర్జున్ కు అచ్చొచ్చినట్టు లేదు. సచిన్ కొడుకైనా అతడికి జాతీయ జట్టులో పక్కనబెడితే కనీసం రంజీ జట్టులో కూడా అవకాశం దక్కడం లేదు. ఎన్నాళ్లు వేచి చూసినా తనకు ఆడే అవకాశమివ్వని జట్టును పట్టుకుని వేలాడటం కంటే వదిలేయడమే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చాడు. ఆలోచన వచ్చిందే తడువుగా ఫాలో అయిపోయాడు. నాకు 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్' కావాలంటూ ముంబై బోర్డుకు లేఖ రాశాడు. ముంబైని వీడనున్న అర్జున్.. త్వరలోనే గోవా రంజీ జట్టు తరఫున ఆడనున్నాడు. ఈ మేరకు గోవా క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. Arjun Tendulkar set to leave Mumbai and will join Goa for the 2022/23 domestic season. pic.twitter.com/LYzPwe7ubi — CricTracker lll (@ottirakattil) August 11, 2022 22 ఏళ్ల అర్జున్.. 2020-21 సీజన్లో ముంబై తరఫున రెండు మ్యాచ్‌లాడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా హర్యానా, పుదుచ్చేరిలతో జరిగిన మ్యాచ్‌లలో అర్జున్ పాల్గొన్నాడు. కానీ ఆ తర్వాత అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. ఇటీవలే ముగిసిన రంజీ ట్రోఫీలో సైతం అర్జున్ పేరును పక్కనబెట్టింది ముంబై. ముంబై రంజీ జట్టు కథ ఇలా ఉంటే.. వేలంలో అర్జున్ ను దక్కించుకున్న ముంబై ఇండియన్స్ కూడా అతడికి ఆడే అవకాశమివ్వలేదు. దీంతో అతడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ క్రమంలోనే అర్జున్.. ఇక ముంబైతో ఉంటే లాభం లేదని భావిస్తున్నాడట. మరోవైపు.. అర్జున్ రాకపై గోవా క్రికెట్ హర్షం వ్యక్తం చేసింది. తాము లెఫ్టార్మ్ పేసర్ కోసం వేచి చూస్తున్నామని, అలాగే మిడిలార్డర్లో పరుగులు చేసే బ్యాటర్ లేక ఇబ్బందులు పడుతున్నామని.. అర్జున్ ఆ లోటును భర్తీ చేస్తాడని తాము నమ్ముతున్నట్టు గోవా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సూరజ్ లొత్లీకర్ తెలిపాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: Rishabh Pant, Urvashi Rautela: ఫేమ్ కోసం ఇంత నీచానికి దిగజారుతారా? ఊర్వశిపై పంత్ ఫైర్ ఇదీ చదవండి: Mumbai Indians: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ‘ముంబయి ఇండియన్స్’ ఆటగాళ్లు వీళ్లే..!