టీమిండియా యువ క్రికెటర్ మనీష్ పాండే సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కర్ణాటకలో జరుగుతున్న మహారాజా ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 పరుగులు చేసి.. తన టీమ్ గుల్బర్గా మిస్టక్స్‌కు భారీ స్కోర్ అందించాడు. శుక్రవారం జరిగిన మహారాజా ట్రోఫీ టీ20 లీగ్ ఫైనల్‌లో మనీస్ పాండే కెప్టెన్సీలోని గుల్బర్గా.. టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ నాయకత్వంలోని బెంగుళూరు బ్లాస్టర్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుల్బర్గా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 220 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ జట్టులో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ 42 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. కెప్టెన్ మనీష్ పాండే 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 పరుగులు చేసి ఆఖర్లో మెరుపులు మెరిపించాడు.
ముఖ్యంగా రోనిత్ మోర్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో అయితే మనీష్ పాండే వరుసగా మూడు సిక్సులు కొట్టి స్కోర్ బోర్డును జెట్‌స్పీడ్‌తో ఉరికించాడు. ఆ ఓవర్‌లో మూడు సిక్సులు, ఒక నో బాల్, మూడు సింగిల్స్‌తో మొత్తం 22 పరుగులు వచ్చాయి. అంతకముందు జెస్వాత్ ఆచార్య 39, రోహన్ పాటిల్ 38, కృష్ణన్ షిర్జిత్ 38 పరుగులు చేసి రాణించారు. దీంతో జట్టుకు భారీ స్కోర్ దక్కింది. ఇక లక్ష్యఛేదనకు దిగిన మయాంక్ సేన బెంగళూరు బ్లాస్టర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ ఎల్‌ఆర్ చేతన్ 40 బంతుల్లో 91 పరుగులు, 6 ఫోర్లు, 8 సిక్సర్లు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. క్రాంతి కుమార్ 41 మినహా మిగతావారెవరు రాణించకపోవడంతో బెంగళూరు 11 పరుగుల తేడాతో ఓడింది. దీంతో గుల్బర్గా ఛాంపియన్‌గా నిలిచింది. మరి ఈ మ్యాచ్‌లో మనీష్ పాండే ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Gulbarga Mystics are the CHAMPIONS of the Maharaja Trophy KSCA T20!! 🔥🙌🏼@GulbargaMystics #MaharajaTrophy #KSCA #T20 #Cricket #Karnataka #IlliGeddavareRaja #ಇಲ್ಲಿಗೆದ್ದವರೇರಾಜ pic.twitter.com/7sTniWTvPL
— Maharaja Trophy T20 (@maharaja_t20) August 26, 2022
Naave Rajaru!@maharaja_t20 @kscaofficial1 @StarSportsKan#GulbargaMystics #HodiyoMachi #MaharajaTrophy #illigeddavareraja#manishpandey #ddp #Karthikca #Rohanpatil #devduttpadikkal pic.twitter.com/spKN4evi0y
— Gulbarga Mystics (@GulbargaMystics) August 26, 2022
Well done Champs.. Very good Target 🎯
Now it’s all upon our bowlers. hope #GulbargMystics will lift the #MaharajaTrophyt20 trophy 🏆 tonight 🤞🏻#ManishPandey ❤️ pic.twitter.com/qkiXVnnrim— Gautam Pandey (@Im_GautamPandey) August 26, 2022