పాక్ మాజీ క్రికెటర్ షాఫిద్ అఫ్రిదీ దుస్సాహసహానికి ఒడిగట్టాడు. జాతీయ జెండాపై ఆటోగ్రాఫ్ చేసి ఇండియాని అగౌరవపరచేలా ప్రవర్తించాడు. అందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం.
భారత్- పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా సాగుతోన్న వైరం గురించి అందరికీ విదితమే. రాజకీయ కారణాలు, సరిహద్దు వివాదాలే కాకుండా ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్ పై దాడికి ఉసిగొల్పుతున్న పాక్ అంటే ఏ ఒక్క భారతీయుడికి నచ్చదు. ఈ వివాదాల కారణంగా ఇరు జట్లు ఐసీసీ టోర్నీల్లో తలపడటం తప్ప.. ద్వైపాక్షిక సిరీసులు ఆడటం లేదు. ఇప్పుడిప్పుడే ఇరు దేశాల ఆటగాళ్లు కలుసుకుంటూ మాట్లాడుకోవడం కాస్త ప్రశాంత వాతావరణాన్ని తలపిస్తున్న సమయంలో పాక్ మాజీ సారథి షాఫిద్ అఫ్రిదీ దాన్ని మళ్ళీ మొదటికి తెచ్చేలా వ్యవహరించాడు. దుస్సహసానికి ఒడిగట్టిన అఫ్రీదీ భారత జాతీయ జెండాపై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అఫ్రీదీ చర్యల పట్ల భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ దిగ్గజ క్రికెటర్లందరూ కలిసి ‘లెజెండ్స్ లీగ్ క్రికెట్’ ఆడుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ టోర్నీలో షాఫిద్ అఫ్రిదీ ఆసియా లయన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఆసియా లయన్స్, ఇండియా మహరాజాస్ మధ్య జరగగా, అఫ్రీదీ భారత జాతీయ జెండాపై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆటగాళ్ల కోసం ఏర్పాటు చేసిన బస్ వైపు ఆఫ్రిది వెళుతున్న సమయంలో ఓ అభిమాని జాతీయ జెండాపై ఆటోగ్రాఫ్ ఇవ్వాలని అడిగాడు. ఆ అభిమాని కోరక మేరకు అఫ్రిది జెండాపై సంతకం చేసి ఇచ్చారు. ‘బిగ్ మ్యాన్ విత్ బిగ్ హార్ట్..’ అంటూ కాప్షన్ జతచేసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం.
𝑩𝑰𝑮 𝑴𝑨𝑵 𝑾𝑰𝑻𝑯 𝑨 𝑩𝑰𝑮 𝑯𝑬𝑨𝑹𝑻 😍
Shahid Afridi gives an autograph to a fan on the Indian flag 🙌#LLC2023 @SAfridiOfficial pic.twitter.com/LonnLwlDAt
— Cricket Pakistan (@cricketpakcompk) March 19, 2023
‘బిగ్ మ్యాన్ విత్ బిగ్ హార్ట్..’ (పెద్ద మనసున్న పెద్ద వ్యక్తి).. పొరుగుదేశాల జాతీయ జెండాని కూడా గౌరవించడం తెలిసిన షాహిద్ ఆఫ్రిదీ అంటూ పొగడ్తల్లో ముంచెత్తింది. అయితే ఈ విషయంపై భారత అభిమానులు మాత్రం కన్నెర్ర జేస్తున్నారు. జాతీయ జెండాపై సంతకం అంటే అది ఇండియాని అగౌరవపరచడమేనని కామెంట్స్ చేస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ వంటి భారత క్రికెటర్లకు ఇలాంటి సందర్భాలు ఎదురైనా వారు అభిమానుల విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించిన సందర్భాలను గుర్తుచేస్తున్నారు. ఏదేమైనా అఫ్రీదీ చర్యలు కాస్త శృతిమించాయనే చెప్పాలి. కాగా, ఈ మ్యాచులో ఇండియా మహరాజాస్‌పై 85 పరుగుల తేడాతో ఆసియా లయన్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసియా లయన్స్ 191 పరుగుల భారీ స్కోరు చేయగా, లక్ష్యఛేదనలో ఇండియా మహారాజాస్ 106 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అఫ్రిదీ చర్యలపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Gautam Gambhir in #LLC2023 so far
We’ve missed you, @GautamGambhir #cricket #ICC pic.twitter.com/7blx4vIAbJ
— Cricket Addictor (@AddictorCricket) March 15, 2023