పాక్ మాజీ క్రికెటర్ షాఫిద్ అఫ్రిదీ దుస్సాహసహానికి ఒడిగట్టాడు. జాతీయ జెండాపై ఆటోగ్రాఫ్ చేసి ఇండియాని అగౌరవపరచేలా ప్రవర్తించాడు. అందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం.
ఎప్పుడూ ఉప్పు-నిప్పుగా ఉండే మాజీ దిగ్గజాలు మరోసారి ఎదురెదురుగా తలపడ్డారు. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచులో షాహిద్ అఫ్రిది సారథ్యంలోని ఏసియా లయన్స్ ఇండియా మహారాజాస్‌పై విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచులో అంతకుమించి పలు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం.