ఎప్పుడూ ఉప్పు-నిప్పుగా ఉండే మాజీ దిగ్గజాలు మరోసారి ఎదురెదురుగా తలపడ్డారు. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచులో షాహిద్ అఫ్రిది సారథ్యంలోని ఏసియా లయన్స్ ఇండియా మహారాజాస్‌పై విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచులో అంతకుమించి పలు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం.
దోహా వేదికగా జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్‌సీ) టోర్నీలో గౌతం గంభీర్ సేన ఓటమి పాలైంది. పాక్ మాజీ సారథి షాహిద్ అఫ్రిది సారథ్యంలోని ఆసియా లయన్స్ తో జరిగిన మ్యాచులో 9 పరుగుల తేడాతో ఇండియా మహారాజాస్ పరాజయం పాలైంది. అయితే, ఈ మ్యాచులో చోటుచేసుకున్న ఆసక్తికర ఘటనలు అభిమానులకు అంతకుమించిన ఆనందాన్ని ఇచ్చాయి. ఎప్పుడూ ఉప్పు-నిప్పుగా ఉండే గౌతమ్ గంభీర్, షాహిద్ అఫ్రిది చాలా ఫ్రెండ్లీగా కనిపించారు.గంభీర్ బ్యాటింగ్ చేస్తుండగా.. బంతి అతని ముఖానికి తగలడం.. షాహిద్ అఫ్రిది గాయం గురించి ఆరా తీయడం అందర్నీ ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
బ్యాటింగ్ చేసేటపుడు గంభీర్ ఎంత అగ్రెస్సివ్ గా కనిపిస్తారో.. మైదానంలోనూ అలానే వ్యవహరిస్తారు. బౌలర్లు విఫలమైనా, ఫీల్డర్లు క్యాచులు నేలపాలు చేసినా వారికి ఆరోజూ కాళరాత్రే. ఇలాంటి సంఘటనలు ఐపీఎల్‌లో ఎన్నో చూశాం.. ఇక పాక్ క్రికెటర్లంటే గంభీర్ గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాక్‌తో మ్యాచ్ అంటే ఇండియాదే పైచేయి ఉండాలన్నది గంభీర్ ఆలోచన. అందుకోసం ఎంతటి కష్టాన్నైనా భరించగలడు. అలాంటి ఎన్నో విలువైన ఇన్నింగ్స్‌లు సైతం ఆడాడు. ప్రస్తుతం రాజకీయాలలో ఉంటూ బిజీ బిజీ జీవితాన్ని గడుపుతోన్న గంభీర్ చాలా రోజుల తరువాత బ్యాట్ పట్టాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్‌సీ) లీగ్‌లో భాగంగా ఇండియా మహారాజాస్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు.
Gautam Gambhir Vs Shahid Afridi team in the Legends League Cricket. pic.twitter.com/6RRqVlcoBW
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 10, 2023
భారత ఇన్నింగ్స్ సందర్భంగా అబ్దుల్ రజాక్ వేసిన 11వ ఓవర్‌లో గంభీర్ ముందుకు జరిగి స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా, అది మిస్సై అతని ముఖానికి తాకింది. ఇది గమనించిన అఫ్రిది.. వెంటనే గంభీర్ దగ్గరకు వచ్చి అంతా ఓకేనా..? అని ఆరా తీసాడు. బదులుగా గంభీర్ అలాంటిదేం లేదని బదులిచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ ఇండియాలో చక్కర్లు కొడుతోంది.
All okay?
Shahid Afridi checks in on Gautam Gambhir during the #LLCT20 match 👍
(Courtesy @LLCT20) #LLCMasters pic.twitter.com/7cBsVR92WV
— ESPNcricinfo (@ESPNcricinfo) March 10, 2023
ఈ మ్యాచులో అఫ్రిది సేన 9 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఏషియన్ లయన్స్ 165 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా, గంభీర్ సేన 156 పరుగులకే పరిమితమైంది. గౌతమ్ గంభీర్(39 బంతుల్లో 7 ఫోర్లతో 54) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఏషియన్ లయన్స్ బౌలింగ్‌లో సోహైల్ తన్వీర్ మూడు వికెట్లు తీశాడు. కాగా, అంతకుముందు ఏషియన్ లయన్స్ బ్యాటర్లలో మిస్బా ఉల్ హక్(50 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఉపుల్ తరంగా(39 బంతుల్లో 2 సిక్స్‌లతో 40) విలువైన పరుగులు చేశాడు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Gautam Gambhir & Shahid Afridi meet at the Legends League Cricket.#LLCT20 #LegendsLeagueCricket pic.twitter.com/eodF1SLhjD
— Muhammad Qamar (@mohammadqamar6) March 10, 2023