మూడో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్, 76 పరుగుల తేడాతో ఘోర పరాజయమే చవిచూసింది. లార్డ్స్ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనను చూశాక లీడ్స్‌లో ఇలాంటి పరాజయం చూడాల్సి వస్తుందని ఎవరూ అనుకోలేదు. 5 టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1తో టైగా ఉంది. రోహిత్, పుజారా, కోహ్లీ తప్ప మిగిలిన బ్యాట్స్‌మెన్లు ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే ఆలౌటైన టీమిండియా తర్వాత బాల్‌తోనూ పెద్దగా ప్రదర్శన చేయలేదు. దాంతో, తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 432 పరుగులు చేసింది.
354 పరుగుల భారీ లోటుతో భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. మూడో రోజు రోహిత్ హాఫ్ సెంజరీ, పుజారా – కోహ్లీ అద్భుత భాగస్వామ్యంతో మూడో రోజు ఆటముగిసే సరికి 215/2 మంచి స్థితిలోకి చేరింది భారత్. పుజారా కూడా అటాక్ మోడ్‌లోకి రావడం, కోహ్లీ సహనంగా బ్యాటింగ్ చేయడం చూసి ఈ మ్యాచ్ కూడా మనదే అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. నాలుగో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే సీన్ రివర్స్ అయ్యింది. పుజారా ఎల్‌బీ అయ్యి సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. కోహ్లీ కూడా 55 పరుగులకే ఔట్ అయ్యాక భారత్ ఆటగాళ్లు ఒక్కొక్కరిగా పెవిలియన్ చేరారు.
నాలుగో రోజు టీమిండియా కేవలం 63 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. 215/2గా ఉన్న స్కోర్ బోర్డు 278/10కి చేరడానికి పెద్ద సమయం పట్టలేదు. ఇంగ్లాండ్ బౌలర్ ఒలీ రాబిన్‌సన్ 5 వికెట్లు తీసి భారత్‌కు భారీ నష్టాన్ని కల్గించాడు. రాబిన్సన్‌కు తోడుగా క్రైగ్ ఓవెర్‌టన్ కూడా 3 వికెట్లు తీశాడు. అండర్సన్, మొయిన్ అలీకి చెరో రెండు వికెట్లు దొరికాయి. వెరసి భారత్‌కు ఇన్నింగ్స్, 76 పరుగుల పరాజయం ఎదురైంది. ఇక, సెప్టెంబర్ 2 నుంచి ఓవల్ స్టేడియంలో ప్రారంభం కాబోయే నాలుగో టెస్టుపైనే టీమిండియా ఆశలు పెట్టుకుంది.