అతని బౌలింగ్‌లో బాల్‌ను టచ్ చేసేందుకు కూడా బ్యాటర్లు భయపడ్డారు. పరుగుల మాట అటుంచితే.. కనీసం బాల్‌ను కొట్టే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే అతని లైన్ అండ్ లెంగ్త్ అంత కచ్చితంగా ఉండేంది. గుడ్ లెంగ్త్‌లో బాల్ వేస్తే.. ఎంతటి బ్యాటర్ అయినా షాట్ ఆడటం కష్టం. అలాగే పదే పదే అలాంటి బాల్స్ వేయడం కూడా బౌలర్‌కు కష్టమే. కానీ.. అతనొక్కడికి మాత్రం అదే అలవాటు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో వేసిన చోటే వేస్తూ.. ఒక మెషీన్‌లా బౌలింగ్ చేస్తూ.. ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అది అలాంటి ఇలాంటి రికార్డు కాదు.. ఒకే మ్యాచ్‌లో ఏకంగా 31 ఓవర్లు మెయిడెన్ వేసిన రికార్డు. నిజానికి దీన్ని రికార్డు అనే కంటే.. అదో చరిత్ర అనడమే ఉత్తమం. ఎందుకంటే.. 59 ఏళ్లుగా ఆ చరిత్ర చెక్కుచెదరకుండా ఉంది. పైగా ఆ చరిత్ర సృష్టించింది.. మన టీమిండియా బౌలరే. అతనే.. రమేష్‌చంద్ర గంగారామ్ నాదకర్ణి. ఇతన్ని అందరూ బాపు నాదకర్ణి అని పిలిచేవారు.
ప్రస్తుతం క్రికెట్‌లో ఏ బౌలరైనా కాస్త బెటర్ ఎకానమీతో బౌలింగ్ వేస్తే.. అద్భుతం, అత్యద్భుతం అంటూ ఆకాశానికెత్తుస్తున్నాం. కానీ.. 41 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ నాదకర్ణి ఎకానమీ 1.67. అన్ని టెస్టులు ఆడిన ఏ బౌలర్ ఎకానమీ కూడా ఇంతకంటే అద్భుతంగా లేదు. అయితే.. నాదకర్ణి ఒక మ్యాచ్‌లో 36 ఓవర్లు బౌలింగ్ చేసి.. ఏకంగా 31 ఓవర్లలో ఒక్కటంటే ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. అది ఇప్పటీ చెక్కచెదరని రికార్డు. ఈ వరల్డ్ రికార్డును నాదకర్ణి ఇంగ్లండ్‌పై సాధించాడు. 1964 జనవరి 10న మద్రాస్ వేదికగా జరిగిన భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో నాదకర్ణి ఈ ఘనత సాధించారు. అతని బౌలింగ్ ఎదుర్కొనేందుకు ఇంగ్లీష్ బౌలర్లు ముప్పుతిప్పలు పడ్డారు. ఒక వైపు నాదకర్ణి పరుగులు ఇవ్వకుండా.. ఒత్తిడిలోకి నెడుతుంటే.. మరోవైపు బౌలర్లు వికెట్లు తీసుకున్నారు. నాదకర్ణికి వికెట్లు దక్కకున్నా.. మిగతా బౌలర్లుకు వికెట్లు పడేందుకు కారణం మాత్రం ఇతను పెంచుతున్న ఒత్తిడే.
తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం 32 ఓవర్లు వేసిన నాదకర్ణి అందులో 27 ఓవర్లు మెయిడెన్‌గా వేశాడు. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో 6 ఓవర్లు వేసి 4 మెయిడెన్లు వేశాడు. ఇలా ఇంగ్లండ్ బ్యాటర్ల చేతులు కట్టిపడేశాడు. నాదకర్ణి తన కెరీర్ మొత్తంలో మొత్తం 41 టెస్టుల్లో 9165 బంతులు వేసిన నాదకర్ణి.. 1.67 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. దాంతో పాటు 88 వికెట్లు సైతం పడగొట్టాడు. అలాగే దేశవాళీ క్రికెట్‌లో సైతం 38,913 బంతులేసి 1.64 ఎకానమీ నమోదు చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో మరే బౌలర్‌కు కూడా ఇలాంటి అద్భుతమైన ఎకానమీ రికార్డు లేదు. వందల సంఖ్యలో వికెట్లు తీసుకున్న బౌలర్లు ఉన్నా.. వారి ఎకానమీ రేటు కూడా నాదకర్ణి కంటే అధికంగానే ఉంది. నాదకర్ణి దగ్గర వికెట్లు లేకపోవచ్చు కానీ.. ఎవరూ టచ్ చేయలేని ఎకానమీ రికార్డు మాత్రం ఉంది. మరి ఈ బౌలర్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
One of the most economical bowlers in the history of the game, Bapu Nadkarni was born #OnThisDay in 1933.
In a career spanning 41 Tests, he picked up 88 wickets with an economy rate of just 1.67, and he also scored 1,414 runs. pic.twitter.com/ITi0bjHD9n
— ICC (@ICC) April 4, 2020