ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో భాగంగా ప్రారంభమైన చివరి టెస్టులో ఒక విచిత్రమై అవుట్ చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ లబుషేన్ 53 బంతుల్లో 44 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 23వ ఓవర్‌లో 134.1 స్పీడ్‌తో బంతిని సంధించాడు. ఈ క్రమంలో అదుపు తప్పిన లబుషేన్… ఒక్కసారిగా బొక్కబోర్లా పడ్డాడు. బంతి వికెట్లను గిరాటేసింది.
ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆనందంతో సంబురాల్లో మునిగిపోయారు. పాపం లబుషేన్ మాత్రం గ్రౌండ్‌లోనే పడి ఉన్నాడు. ప్రస్తుతం లబుషేన్ అవుట్ అయిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఇక ఆసీస్ ఇప్పటికే 3-0 తేడాతో ఆసీస్ సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నాలుగో టెస్టు డ్రాకాగా… ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించి పరువు నిలుపుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. మరి లబుషేన్ అవుట్ అయిన విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
One of the weirdest dismissals we’ve ever seen! 😱#Ashes pic.twitter.com/8Qp5rKprn8
— cricket.com.au (@cricketcomau) January 14, 2022