ఫస్ట్ ఛాన్స్ అనేది ఎవరికైనా సరే మరిచిపోలేని అనుభూతి. అది ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకంగా ఉండిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇక క్రికెట్ లో అయితే తమ తొలి మ్యాచులో సదరు ఆటగాళ్లు టెన్షన్ టెన్షన్ గా ఉన్నప్పటికీ కొన్నిసార్లు అద్భుతాలు చేస్తే.. మరికొన్నిసార్లు తడబడుతుంటారు. ఇప్పుడు కేఎస్ భరత్ మాత్రం లైఫ్ టైమ్ గుర్తుండిపోయే మెమొరీని సేవ్ చేసి పెట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టులో తన తొలి స్టంపింగ్ ని అదిరిపోయేలా తీశాడు. ప్రస్తుతం ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రా కుర్రాడు కేఎస్ భరత్ గురించి క్రికెట్ ప్రేమికులకు తెలుసు. ఐపీఎల్ లో ఆర్సీబీ తరఫున అదరగొట్టిన మనోడికి టీమిండియా టెస్టు జట్టులో ఎప్పుడో మూడేళ్ల క్రితమే ఛాన్స్ వచ్చింది. కానీ పంత్ తోపాటు పలువురు ఆల్రెడీ పోటీ ఉండేసరికి మనోడి ఛాన్స్ రాలేదు. ఓ నెల క్రితం పంత్ కి యాక్సిడెంట్ కావడంతో అతడు బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు. దీంతో కేఎస్ భరత్ ని అవకాశం వరించింది. ఆస్ట్రేలియాతో తొలి టెస్టుతో అతడు అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచులో భరత్ తోపాటు సూర్య కూడా ఎంట్రీ ఇచ్చాడు.
ఇక తొలి టెస్టు ఆడుతున్న భరత్.. మ్యాచ్ స్టార్టింగ్ లో కాస్త టెన్షన్ గా కనిపించాడు. బాల్స్ ని పట్టుకోవడం కాస్త మిస్ చేశాడు. కానీ కెరీర్ ఫస్ట్ స్టంపింగ్ మాత్రం గుర్తుండిపోయేలా చేశాడు. అది కూడా ప్రమాదకర లబుషేన్ ని 49 పరుగులతో ఉన్న టైంలో ఔట్ చేశాడు. జడేజా బౌలింగ్ లో లబుషేన్ ఫ్రంట్ ఫుట్ తీసుకుని షాట్ కొడదామని ప్రయత్నించాడు. బంతి మిస్ కావడం, అదే టైం భరత్ పట్టుకోవడం, వికెట్లని గిరాటేయడం.. ఇవన్నీ కూడా చకాచకా జరిగిపోయాయి. తొలి ఔట్ చేసిన తర్వాత భరత్ చాలా ఆనందంగా గాల్లోకి ఎగురుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
No doubt KS Bharat is the best replacement of pant pic.twitter.com/dKcuxfPfGd
— Ayush™ 🇮🇳🚩 (@vkkings007) February 9, 2023