బ్యాటర్‌గా తొలి మూడు టెస్టుల్లో విఫలమైన కేఎస్ భరత్... నాలుగు టెస్టు ఆరంభమైన కొద్ది సేపటికే ఒక సింపుల్ క్యాచ్ జారవిడిచి, వికెట్ కీపర్‌గా కూడా పనికిరాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా అహ్మాదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరిదైన నాలుగో టెస్టు గురువారం ప్రారంభమైంది. తొలి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన భారత్, మూడో టెస్టులో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సిరీస్ మన చేతుల్లోనే ఉన్నా.. మూడో టెస్టులోనే గెలిచి డబ్ల్యూటీసీ(వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్) ఫైనల్‌కు అర్హత సాధిస్తుందనుకుంటే.. మూడో టెస్టులో ఓడి అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పుడు భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే నాలుగు టెస్టులో కచ్చితంగా విజయం సాధించి తీరాల్సిన పరిస్థితి. లేదంటే.. శ్రీలంక-న్యూజిలాండ్ సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సి వస్తుంది.
ఈ నేపథ్యంలో ఎంతో కీలకమైన నాలుగో టెస్టులో టీమిండియా ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. మొహమ్మద్ సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చిన టీమిండియా మూడో టెస్టులో రెస్ట్ ఇచ్చిన షమీని జట్టులోకి తీసుకుంది. ఈ ఒక్క మార్పుతోనే భారత్ నాలుగో టెస్టు బరిలో దిగింది. అయితే.. తొలి మూడు టెస్టుల్లో పెద్దగా రాణించని కేఎస్ భరత్‌పై నాలుగో టెస్టులో వేటు పడుతుందని అనుకున్నా.. టీమ్ మేనేజ్‌మెంట్, కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, భరత్‌కు మద్దతుగా నిలిచారు. నాలుగో టెస్టులోనూ భరత్‌కు తుది జట్టులో చోటు కల్పించారు. కాగా.. మూడో టెస్టు తర్వాత భరత్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. బ్యాటింగ్‌లో విఫలం అవుతున్నాడంటూ అతని క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. అతని స్థానంలో ఇషాన్ కిషన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ సైతం వినిపించింది.
అయినా కూడా కోచ్, కెప్టెన్.. భరత్‌పై పూర్తి నమ్మకం ఉంచి చివరి టెస్టులోనూ అతన్నే ఆడించారు. ఎన్ని విమర్శలు వచ్చినా అతన్ని బ్యాక్ వస్తూ వచ్చిన వారిని కేఎస్ భరత్ నాలుగో టెస్టు ఆరంభంలోనే నిరాశ పరిచాడు. ఇన్నింగ్స్ మొదలై.. ఉమేష్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 6వ ఓవర్ ఐదో బంతికి ట్రావిస్ హెడ్ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను భరత్ నేలపాలు చేశాడు. చాలా సింపుల్‌గా చేతుల్లో పడిన బంతిని భరత్ నిలుపుకోలేకపోయాడు. దీంతో భారత జట్టు ఆటగాళ్లతో పాటు ఆస్ట్రేలియా ఆటగాళ్లు సైతం ఆశ్చర్యపోయారు. ఇంత సింపుల్‌ను క్యాచ్‌ను పట్టకపోవడంపై అంతా షాక్ అయ్యారు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అయితే.. భరత్‌ను ఏం అనకుండా చాలా కామ్‌గా ఉండిపోయాడు. కాగా.. భరత్ క్యాచ్ వదిలేసిన విధానంపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. భరత్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను తీసుకున్నా బాగుండేదని అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
KS Bharat drops an Easy catch of Travis head….can prove to be costly 😬#INDvAUS pic.twitter.com/VrTE8HEnFF
— Cricpedia (@_Cricpedia) March 9, 2023
KS bharat drop here. You can see he takes a step to the legside. (Second photo) So already he is unbalanced, and then he doesn’t quiet get to the ball, he reaches out (last photo) very tough to take a opposite step then come back in. Technical error #INDvsAUSTest #INDvAUS pic.twitter.com/7pwSdIPUKu
— lucas (@LucasR32sky) March 9, 2023
KS Bharat drops a sitter! 🙁
(Pic – Disney + Hotstar)#CricketTwitter #INDvAUS #TravisHead #RohitSharma pic.twitter.com/yz3duYcYTO
— CRICKETNMORE (@cricketnmore) March 9, 2023