విరాట్ కోహ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కోహ్లీ డాన్స్ స్కిల్స్ మెచ్చిన ఓ రచయిత అతనికి మూవీ ఆఫర్ చేశాడు. ఓ సీక్వెల్ మూవీలో నటించాల్సిందిగా కోరాడు.
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఎక్కడున్నా ఆ కిక్కే వేరు. ఎప్పుడూ ఎనర్జటిక్ గా కనిపించే కోహ్లీ ఏదో ఒక విధంగా పక్కవాళ్లని వినోదపరుస్తూనే ఉంటాడు. మైదానంలో అభిమానులన ఎంకరేజ్ చేస్తూ.. కేరింతలు కొట్టిస్తుంటాడు. అంతేకాదు.. అప్పుడప్పుడు కొన్ని స్టెప్పులు కూడా వేస్తుంటాడు.. ఈ రన్ మెషిన్. అందుకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. ఈమధ్యనే కోహ్లీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు.. నాటు’ పాటకు స్టెప్పులేశాడు. ఆపై ఇటీవల జరిగిన ఓ మ్యాచ్‌లో షారుఖ్‌తో కలిసి పఠాన్ సాంగ్ చేశాడు. కోహ్లీలో ఉన్న ఈ ప్రతిభను గుర్తించిన ఓ వివాదాస్పద రచయిత అతనికి మూవీ ఆఫర్ చేశాడు.
వివాదాస్పద రచయిత, నటుడు, నిర్మాత కమల్ ఆర్ ఖాన్ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన హిందీ సినిమాలతో పాటు పలు భోజ్‌పురి చిత్రాల్లోనూ నటించాడు. ఈ రచయితే కోహ్లీకి మూవీ ఆఫర్ చేశాడు. ఐపీఎల్ 2020 సమయంలో కోహ్లీ చేసిన డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసిన కమల్ ఖాన్.. తాను నిర్మిస్తున్న ‘దేశద్రోహి-2’ చిత్రంలో నటించాల్సిందిగా విరాట్ ను కోరాడు. ‘తనకు కోహ్లీ డ్యాన్స్ స్కిల్స్ ఎంతగానో నచ్చాయని, అందుకే తన తదుపరి చిత్రం #Deshdrohi2లో అతనికి ఐటెమ్ నంబర్‌ను ఆఫర్ చేద్దామనుకుంటున్నాను..’ అంటూ కమల్ ఖాన్ ట్వీట్ చేశాడు. అయితే నెటిజన్స్ మాత్రం అతన్ని బండబూతులు తిడుతూ ఏకిపారేస్తున్నారు.
I am very impressed by @imVkohli dance skills, hence I offer him an item number in my film #Deshdrohi2! 🤪🤪😁 pic.twitter.com/E51wZD8m3i
— KRK (@kamaalrkhan) April 14, 2023
కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగు మ్యాచుల్లో ,మూడు అర్ధ సెంచరీలతో పరుగుల వరద పారిస్తున్నాడు. ముంబైతో జరిగిన తొలి మ్యాచులో.. 49 బంతుల్లోనే 82 పరుగులు చేసిన కోహ్లీ, కేకేఆర్ పై.. 21, లక్నో సూపర్ జెయింట్ పై.. 61, ఢిల్లీ క్యాపిటల్స్ పై.. 50 ఇలా ప్రతి మ్యాచులోనూ నిలకడగా రాణిస్తున్నాడు. మరి కోహ్లీ మూవీ ఆఫర్ సద్వినియోగం చేసుకుంటాడా..? లేదా..? అన్నది సస్పెన్స్. కోహ్లీకి మూవీ ఆఫర్ రావడంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli in IPL 2023 for RCB:
•1st match – Highest scorer.
•2nd match – 2nd Highest scorer
•3rd match – 2nd highest scorer.
•4th match – Highest scorer.Most runs, best average, most 50s, most boundaries for RCB in this IPL. King Kohli – The Backbone, The Heart of RCB. pic.twitter.com/1bH3b23HbE
— CricketMAN2 (@ImTanujSingh) April 15, 2023
Virat Kohli completed 200 runs in IPL 2023 at an average of 100 & Strike Rate of 145.
King Kohli show. pic.twitter.com/K0vB0Agg29
— Johns. (@CricCrazyJohns) April 15, 2023