టీమిండియా యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఎంతటి టాలెంటెడ్ ప్లేయరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిడిల్డార్‌లో, చివరి ఓవర్లలో అద్భుతంగా బ్యాటింగ్ చేయగల ఆటగాడు. గ్రౌండ్ అన్నివైపులా షాట్లు ఆడగలడు. అందుకే అతన్ని ఇండియన్ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్‌గా క్రికెట్ అభిమానులు పిలుస్తుంటారు. సాధారణంగా ఇప్పటి వరకు సూర్య మిడిల్డార్‌లోనే బ్యాటింగ్‌కు వచ్చేవాడు. కానీ.. వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా వస్తున్నాడు.
అక్టోబర్‌లో జరగబోయే టీ20 వరల్డ్ కోసం ఒక స్ట్రాంగ్ టీమ్‌ను తయారు చేసేందుకు జట్టులో ఇలాంటి మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్‌ను ఓపెనర్లుగా ట్రై చేశారు. కానీ ఏ ప్రయోగం కూడా ఫలితం ఇవ్వడం లేదు. పైగా ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొడుతున్నట్లు అనిపిస్తుంది.
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పి భారీ ఇన్నింగ్స్‌లు ఆడే సత్తా సూర్యకుమార్ యాదవ్‌కు ఉంది. అలాంటి ఆటగాడిని తీసుకొచ్చి అనవసరంగా ఓపెనర్‌గా ఆడిస్తున్నట్లు ఉంది పరిస్థితి. ఎందుకంటే సూర్య ఓపెనర్‌గా వచ్చిన రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలం అయ్యాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 24 పరుగులు చేసిన సూర్య రెండో మ్యాచ్‌లో కేవలం 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్, 1983 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు సభ్యుడు కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందిస్తూ.. సూర్యకుమార్ యాదవ్ కెరీర్‌ను నాశనం చెయొద్దంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను కోరారు. టీ20 వరల్డ్ కప్ కోసం జట్టులో అనవసరపు మార్పులు చేస్తూ.. నాలుగో స్థానంలో అద్భుతంగా బ్యాటింగ్ చేయగల సూర్యను ఓపెనర్‌గా ఆడించి అతని కెరీర్‌ను ఆగం చెయొద్దని సూచించారు. వెస్టిండీస్‌తో టీ20ల్లో ఓపెనర్‌గా వస్తున్న సూర్య పరుగులు చేయలేకపోతున్నాడని.. దీంతో అతని ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందని శ్రీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు.
సూర్య లాంటి హైలీ టాలెంటెడ్ ప్లేయర్‌ను ఏ స్థానంలో ఆడించాలో ఆ స్థానంలోనే ఆడించాలని.. లేదంటే మొదటికే మోసం వస్తుందని శ్రీకాంత్ హెచ్చరించారు. కాగా.. టీమిండియాకు తరచు కెప్టెన్లు, ఓపెనింగ్ స్థానంలో మార్పులు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ కోసం ఇలా ప్రయోగాలు చేసుకుంటూ పోతే జట్టులో నిలకడ ఎలా వస్తుందని క్రికెట్ నిపుణులు సైతం ప్రశ్నింస్తున్నారు. మరి సూర్యకుమార్ యాదవ్‌ను ఓపెనర్‌గా ఆడించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
IND vs WI, 2nd T20: Former cricketer of Team India and the swashbuckling batsman of his time, Krishnamachari Srikkanth has fiercely slammed Team India captain Rohit Sharma. Suryakumar Yadav has openedthe innings with Rohit in the first two T20 #INDvsWhttps://t.co/v2OK0Kh71l pic.twitter.com/FwKZI6ekZv
— Baba Cric (@BabaCric) August 2, 2022