టన్నుల కొద్ది రన్స్ కొట్టిన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం బ్యాడ్‌ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టు, వన్డే సిరీస్‌లలో దారుణంగా విఫలం అయ్యాడు. దీంతో కోహ్లీపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కోహ్లీ స్థానంలో యువ క్రికెటర్లకు స్థానం కల్పించాలనే డిమాండ్ వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 22 నుంచి వెస్టిండీస్‌తో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌కు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ నుంచి విరాట్ కోహ్లీని విశ్రాంతి పేరుతో తప్పించారు.
కోహ్లీ కెరీర్‌లో ఇంత పెద్ద గ్యాప్ ఎప్పుడూ లేదు. పైగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న కోహ్లీ.. ఆసియా కప్‌తో జట్టులోకి వస్తాడని సెలెక్టర్లు చెప్తున్నారు. మరి దొరికిన ఈ ఖాళీ సమయాన్ని ఫామ్ అందుకునేందుకు కోహ్లీ ఎలా ఉపయోగించుకుంటాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న గట్టుపరిస్థితి అసలు సమస్యే కాదని.. కోహ్లీ అవుట్ ప్రతి బంతి అద్భుతమైన బంతి అని ఆయన అన్నారు. వెస్టిండీస్‌తో సిరీస్‌కు కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు.. ఈ టైమ్‌లో కోహ్లీ మళ్లీ తన అకాడమీకి వస్తే అంతా సెట్ చేస్తానని రాజ్‌కుమార్ పేర్కొన్నారు. తన అకాడమీ కోహ్లీ సొంత గ్రౌండ్ లాంటిదని.. అతను ఇక్కడ చాలా ఫ్రీగా ఉండొచ్చని.. ఇద్దరం తన ఫామ్‌పై చర్చించి, ఫలితం రాబట్టగలమంటూ ధీమా వ్యక్తం చేశారు.
గతంలో కోహ్లీ చాలా బిజీగా ఉండేవాడని.. ఇప్పుడు తనకు కాస్త సమయం దొరకడంతో అతను ఇక్కడి వస్తే బాగుంటుందని.. కోహ్లీ తన అకాడమీకి రావడాన్ని తానెంతో ఇష్టపడతానన్నారు రాజ్‌కుమార్ శర్మ. సెంచరీలను మంచినీళ్ల ప్రాయంలా కొట్టే కోహ్లీ.. ఇప్పటి వరకు 70 శతకాలు బాదాడు. కానీ.. అతని బ్యాట్ నుంచి సెంచరీ వచ్చి మూడేళ్లు అవుతుందంటేనే అర్థం చేసుకోవచ్చు కోహ్లీ ఎలాంటి దారుణమైన ఫామ్‌లో ఉన్నాడో.
కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ అనుకున్నట్లే కోహ్లీ.. తన చిన్ననాటి కోచ్ వద్దకు వెళ్లి కొంత సమయం గడిపి.. ఫామ్‌లోకి వస్తే సగటు క్రికెట్ అభిమానికి అంతకంటే ఏం కావాలి. మరి కోహ్లీ ఈ గ్యాప్‌ను ఎలా వాడుకుంటాడో వేచి చూడాల్సిందే. కాగా కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Would love it if @imVkohli spends time at my academy: Coach Rajkumar Sharma
READ: https://t.co/mN41XRmrrN pic.twitter.com/9kmYlN7xlv
— TOI Sports (@toisports) July 18, 2022