కొన్నాళ్ల ముందు వైస్ కెప్టెన్సీ పీకేశారు. ఇప్పుడు ఏకంగా జట్టు నుంచి సైడ్ చేసి బెంచ్ పై కూర్చోబెట్టారు. దీంతో కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. మరి అతడి విషయంలో ఏం జరుగుతోంది?
టీమిండియాలోకి ఎంతోమంది క్రికెటర్లు వస్తుంటారు, పోతుంటారు. కానీ ప్రతి మ్యాచ్ లోనూ అద్భుతంగా కాకపోయినా సరే కాస్తోకూస్తో ఆడితేనే జట్టులో ఉంచుతారు. లేదంటే కచ్చితంగా పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే ప్రస్తుతం ఒక్కో ప్లేస్ కోసం ఇద్దరు ముగ్గురు ప్లేయర్లు పోటీపడుతున్నారు. ఇలాంటి టైంలో జట్టులో స్థానం నిలుపుకోవాలంటే మాత్రం బాగా శ్రమించాల్సిందే. లేదంటే మాత్రం ఎంత పెద్ద స్టార్ ఆటగాడు అయినా సరే తిప్పలు తప్పవు. ఓపెనర్ కేఎల్ రాహుల్ ని చూస్తుంటే దాదాపు ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే మనోడికి పరిస్థితులు అలా పగబట్టేశాయి మరి! ఇంతకీ రాహుల్ విషయంలో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.
ఇక విషయానికొస్తే.. టీమిండియాకు దొరికిన అద్భుతమైన బ్యాటర్లలో కేఎల్ రాహుల్ ఒకడు. ఓపెనర్, మిడిలార్డర్ లేదా వేరే ఏ ప్లేసులో అయినా అద్భుతమైన బ్యాటింగ్ చేయగల సమర్థుడు. వికెట్ కీపింగ్ చేయడం ఇతడికి మరో ప్లస్ పాయింట్. ఇప్పటికే జట్టులో రెగ్యులర్ కీపర్స్ ఉన్నారు కాబట్టి.. రాహుల్ జస్ట్ బ్యాటర్ గా మాత్రమే కొనసాగుతున్నాడు. కానీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం బ్యాటింగ్ విషయంలో పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడు. 2021 సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా జట్టులో ఉన్న రాహుల్.. ఆ తర్వాత శ్రీలంక సిరీస్ కోసం పూర్తిస్థాయి వైస్ కెప్టెన్ అయిపోయాడు.
దక్షిణాఫ్రికాతో టెస్టు, బంగ్లాదేశ్ తో రెండు టెస్టులకు తాత్కాలిక కెప్టెన్ గా కూడా చేశాడు. కెప్టెన్ గా ఎలాంటి సక్సెస్ చూశాడు అనేదానికంటే బ్యాటర్ గా మాత్రం పూర్తిగా నిరుత్సాహపరిచాడు. కెప్టెన్, వైస్ కెప్టెన్ అయిన తర్వాత 7 టెస్టుల్లో 175 పరుగులు మాత్రమే రాహుల్ చేశాడు. గతేడాది ఒక్కటంటే ఒక్కసారి మాత్రమే 50 పరుగులకు మించి చేశాడు. దీంతో శ్రీలంకతో స్వదేశంలో జరిగిన సిరీస్ లో రాహుల్ ను వన్డే వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టుల కోసం జట్టులో కొనసాగించారు. కానీ మనోడిలో పెద్దగా మార్పేం రాలేదు.
బోర్డర్ గావస్కర్ సిరీస్ లో రాహుల్.. తొలి రెండు టెస్టుల్లో 12.67 యావరేజ్ తో 38 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడి ప్లేస్ ప్రశ్నార్థకంగా మారిందని చాలామంది అనుకున్నారు. మూడో టెస్టులో కొనసాగిస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ రాహుల్ ని తప్పించారు. అతడి స్థానంలో శుభమన్ గిల్ కు ఛాన్స్ ఇచ్చారు. ఇదంతా చూసి కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఇప్పుడు ఏకంగా బెంచ్ పై కూర్చోబెట్టారు. కొంపదీసి పూర్తిగా సైడ్ చేయడానికి ప్లాన్ ఏమైనా వేస్తున్నారా అనే మాట్లాడుకుంటున్నారు. మరి రాహుల్ విషయంలో ఏం జరుగుతుందనేది చూడాలి. రాహుల్ ని బెంచ్ పై కూర్చోబెట్టడం గురించి మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
There’ll be a comeback after every setback. Comeback stronger KL Rahul 🙌#CricTracker #KLRahul #BGT #INDvAUS pic.twitter.com/iMINEJlgzi
— CricTracker (@Cricketracker) March 1, 2023