కొన్నాళ్ల ముందు వైస్ కెప్టెన్సీ పీకేశారు. ఇప్పుడు ఏకంగా జట్టు నుంచి సైడ్ చేసి బెంచ్ పై కూర్చోబెట్టారు. దీంతో కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. మరి అతడి విషయంలో ఏం జరుగుతోంది?
ఇప్పటికే వన్డే కెప్టెన్ మార్పు, విరాట్ కోహ్లీ అలక, రోహిత్ శర్మ గాయంతో సతమతం అవుతున్న టీమిండియాకు మరో కొత్త సవాల్ ఎదురైంది. ఈ నెల 26 నుంచి సౌతాఫ్రికాతో భారత్ టెస్ట్ సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనకు ముందు భారత్‌కు కొత్త సమస్య వచ్చిపడింది. అదే టీమిండియా వైస్‌కెప్టెన్ ఎంపిక. నిజానికి సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు జట్టును ప్రకటించినప్పుడే సెలెక్టర్లు రోహిత్ శర్మను కొత్త వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. కాగా రోహిత్ […]