టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ విషయంలో బీసీసీఐ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆ విషయంలో అతడిపై వేటు వేసింది. ఇదికాస్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
టీమిండియాకు ఆడుతూ ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా విమర్శలు ఫేస్ చేసిన క్రికెటర్ ఎవరైనా ఉన్నారా అంటే అది కేఎల్ రాహుల్ మాత్రమే. ఐపీఎల్ అద్భుతంగా ఆడే ఇతడు.. జాతీయ జట్టు తరఫున మాత్రం ఏడాది నుంచి ఫామ్ కోల్పోయాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా ప్రతిదానిలోనూ ఫెయిలవుతూ ఉన్నాడు. ఓపెనర్ గా పరుగులు చేయడానికి నానా తంటాలు పడుతున్నాడు. ఈ క్రమంలోనే రాహుల్ విషయంలో బీసీసీఐ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. దీనిపై నెటిజన్స్ చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ రాహుల్ కు ఏం జరిగింది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకకు చెందిన కేఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాటర్ కమ్ ఓపెనర్ కమ్ వికెట్ కీపర్. ఒకానొక దశలో కెప్టెన్ కూడా అవుతాడని అనుకున్నారు. ప్రస్తుతం స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్ ఆడుతున్నాడు. నాగ్ పూర్, దిల్లీలో జరిగిన రెండు టెస్టుల్లోనూ ఘోరంగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే బీసీసీఐ అతడికి గట్టి షాకిచ్చింది. టెస్టు వైస్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. 2021లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా జట్టులో ఉన్న రాహుల్.. ఆ తర్వాత శ్రీలంక సిరీస్ తో పూర్తిస్థాయి వైస్ కెప్టెన్ గా మారాడు. సౌతాఫ్రికాతో టెస్టు, బంగ్లాదేశ్ తో రెండు టెస్టులకు తాత్కాలిక కెప్టెన్ గానూ వ్యవహరించారు. కెప్టెన్సీ ,వైస్ కెప్టెన్సీ పక్కనబెడితే.. బ్యాటింగ్ లో మాత్రం ఏ మాత్రం తేడా కనిపించలేదు. అయినా అతడిని జట్టులో కొనసాగిస్తుండటంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి.
తాజాగా ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులు, మూడు వన్డేలకు జట్టుని ప్రకటించింది. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ ని టెస్టు వైస్ కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అతడి బదులు వేరే ఎవరినీ వైస్ కెప్టెన్ గా నియమించలేదు. ఇక కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ అందుకున్న తర్వాత 7 టెస్టుల్లో 175 పరుగులు మాత్రమే రాహుల్ చేశాడు. ఇదిలా ఉండగా గతేడాది కూడా ఒక్కసారే 50 పరుగులకు మించి చేశాడు. దీంతో శ్రీలంకతో స్వదేశంలో జరిగిన సిరీస్ లో రాహుల్ ను వన్డే వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించారు. హార్దిక్ పాండ్యని ఆ ప్లేస్ లో నియమించారు. ఇక చివరి రెండు టెస్టుల్లో రాహుల్ ని జట్టులోకి తీసుకుంటే గిల్ బెంచ్ కి పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ మ్యాచుల్లోనూ రాహుల్ విఫలమైతే అతడి కెరీర్ ప్రమాదంలో పడొచ్చు.
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభమన్ గిల్, పూజారా, విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, షమి, సిరాజ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఉమేశ్ యాదవ్, జైదేవ్ ఉనద్కత్
రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, చాహల్, షమి, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దుల్ ఠాకుర్, అక్షర్ పటేల్, జైదేవ్ ఉనద్కత్
India’s squad for 3rd & 4th Test vs Australia
Rohit Sharma (C), KL Rahul, S Gill, Cheteshwar Pujara, Virat Kohli, KS Bharat (wk), Ishan Kishan (wk), R Ashwin, Axar Patel, Kuldeep Yadav, R Jadeja, Mohd Shami, Mohd Siraj, Shreyas Iyer, Suryakumar Yadav, Umesh Yadav, Jaydev Unadkat
— BCCI (@BCCI) February 19, 2023
𝗡𝗢𝗧𝗘: Mr Rohit Sharma will be unavailable for the first ODI due to family commitments and Mr Hardik Pandya will lead the side in the first ODI.
— BCCI (@BCCI) February 19, 2023