విచిత్రమైన బౌలింగ్ యాక‌్షన్‌తో మొదట ఫేమస్ అయిన మలింగా.. ఆ తర్వాత యార్కర్లతో బ్యాట్స్‌మెన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. డెత్త్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి శ్రీలంకకు, ఐపీఎల్‌లో ముంబైకి ఎన్నో విజయాలు అందించాడు. ఇటివల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు మలింగా.. ఇంకా పూర్తిగా మలింగాను క్రికెట్ ఫ్యాన్స్ మర్చిపోకముందే.. అతన్ని తలపిస్తున్నాడు మరో యువ శ్రీలంకన్ క్రికెటర్.
ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా కప్‌లో శ్రీలంక తరపున బరిలోకి దికిన మతీష పతిరన అనే కుర్రాడు.. అచ్చం మలింగా లాంటి బౌలింగ్ యాక‌్షన్‌తో పాటు అంతటి పాదునైన యార్కర్లతో బ్యాటర్లను బెంబేలేత్తిస్తున్నాడు. దీంతో మలింగా వారసుడు వచ్చేశాడని క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అతని బౌలింగ్ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. మరి ఈ జూనియర్ మలింగాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Malinga’s legacy – 19 year old Matheesha Pathirana who is currently in the Sri Lanka Under 19 squad playing in the ACC Under 19 Asia Cup #Cricket pic.twitter.com/BU9tOIB52u
— Saj Sadiq (@SajSadiqCricket) December 23, 2021