2023 ఐపీఎల్ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆటగాడు ప్రస్తుతం పాకిస్థాన్ లో జరుగుతున్న పీఎస్ఎల్ లో గాయపడ్డాడు.
2023 IPL..మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రూ. 4. 4 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన స్టార్ బౌలర్ గాయం కారణంగా దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్ లో జరుగుతున్న పీఎస్ఎల్ లో ఈ స్టార్ ఆటగాడు గాయపడ్డాడు. దాంతో అతడు కోలుకోవడానికి రెండు నెలలు సమయం పడుతుందని సమాచారం. ఇదే నిజం అయితే టైటాన్స్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
జోషువా లిటిల్.. ఐర్లాండ్ నయా సంచలనం. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ తో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. దాంతో అతడిపై ఈ ఐపీఎల్ లో కాసుల వర్షం కురుస్తుందని అందరు భావించారు. అనుకున్నట్లుగానే అతడిపై కోట్లు కురిశాయి. జోషువా లిటిల్ ను రూ. 4.4 కోట్లకు కొనుగోలు చేసింది గత సీజన్ విన్నర్ గుజరాత్ టైటాన్స్. ఇక పాకిస్థాన్ లీగ్ లో ముల్తాన్ సుల్తాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న లిటిల్.. మోకాలి గాయం బారిన పడ్డాడు. అతడు గాయం నుంచి కోలుకోవడానికి కనీసం రెండు నెలలు పడుతుందని సమాచారం. ఈ క్రమంలోనే అతడు ఈ ఐపీఎల్ మెుత్తానికి దూరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. జోషువా లిటిల్ దూరం అయితే కనుక గుజరాత్ టైటాన్స్ కు పెద్ద దెబ్బనే చెప్పాలి.