అంతర్జాతీయ క్రికెట్‌లో కేవలం 4 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం. కానీ.. కేవలం ఒకే ఒక్క ఓవర్‌తో హీరోగా మారిపోయాడు. ప్రపంచ వ్యాప్తంగా అతని పేరు మారుమోగిపోయింది. అతనే 2007 టీ20 వరల్డ్ కప్ హీరో జోగిందర్ శర్మ. టీమిండియా గెలిచిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ 2007లో పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో చివరి ఓవర్‌లో పాకిస్థాన్‌కు 13 రన్స్ కావాల్సిన టైమ్‌లో ధోని అనూహ్యం నిర్ణయంతో బాల్ అందుకుని.. మిస్బా ఉల్ హక్‌ను తన స్లోవర్ డెలవరీతో బోల్తా కొట్టించి.. టీమిండియాకు తొలి టీ20 వరల్డ్ కప్ అందించిన జోగిందర్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు సైతం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీకి తన రిటైర్మెంట్ లేఖను పంపించాడు.
2002 నుంచి 2017 వరకు సాగిన తన కెరీర్‌లో బీసీసీఐ అందించిన సపోర్ట్ మరువలేనిదని అన్నాడు. అలాగే తన సుదర్ఘీ కెరీర్‌లో తనతో పనిచేసిన కోచ్‌లు, సపోర్టింగ్ స్టాఫ్‌కు కూడా జోగిందర్ ధన్యవాదాలు తెలిపాడు. అలాగే తనకు తోడుగా నిలిచిన కుటుంబసభ్యులు, అభిమానులు, స్నేహితులకు సైతం కృతజ్ఞతలు చెప్పాడు. ఎన్నో మధుర జ్ఞాపకాలతో తన కెరీర్ సాగిందని, ఇప్పుడు వీడ్కోలు పలకడాన్ని సైతం ఎంతో ఆస్వాదిస్తున్నట్లు జోగిందర్ పేర్కొన్నాడు. తన కెరీర్‌లో 4 వన్డేలు ఆడిన శర్మ 35 పరుగులు చేశాడు. అలాగే 4 టీ20ల్లో జోగిందర్‌కు బ్యాటింగ్ చేసే అవకావం రాలేదు. నాలుగు వన్డేల్లో ఒకటి, టీ20ల్లో 4 వికెట్లు తీసుకున్నాడు. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 77 మ్యాచ్‌లు ఆడిన జోగిందర్ ఖాతాలో 2804 పరుగులు, 297 వికెట్లు ఉన్నాయి. అలాగే లిస్ట్-ఏ క్రికెట్‌లో 80 మ్యాచ్‌ల్లో 1040 పరుగులు, 115 వికెట్లు ఉన్నాయి. అయితే.. అంతర్జాతీయ కెరీర్ పెద్దగా లేకున్నా.. జోగిందర్ శర్మకు భారీ గుర్తింపు రావడానికి కారణం.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో అతను చివరి ఓవర్ వేయడమే కారణం. మరి జోగిందర్ రిటైర్మెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Announced retirement from cricket Thanks to each and everyone for your love and support 🙏❤️👍👍 pic.twitter.com/A2G9JJd515
— Joginder Sharma 🇮🇳 (@MJoginderSharma) February 3, 2023