క్రికెట్ అనేది ఆట మాత్రమే కాదు.. చాలామందికి అదొక ఎమోషన్. టీ20, వన్డే, టెస్టు, రంజీ, కౌంటీ ఇలా ప్రతి మ్యాచ్ ని వదలకుండా చూస్తుంటారు. క్రికెట్ లో ఏదైనా సాధ్యమే.. ఎలాంటి అద్భుతాలైనా జరగచ్చు. అలాంటి అద్భుతమే ఒకటి ఇప్పుడు బిగ్ బాష్ లీగ్ లో జరిగింది. అది కూడా అలాంటి ఇలాంటి విషయం కాదు. ఒక బౌలర్ ఏకంగా ఒకే బంతికి 16 పరుగులు సమర్పించుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అసలు ఆ బౌలర్ ఎవరు? అన్ని పరుగులు ఎలా ఇచ్చాడో ఇప్పుడు చూద్దాం..
బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీ సిక్సర్స్, హోబర్ట్ హరికేన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ కి రెండో ఓవర్ వేసేందుకు ఆసీస్ పేసర్ జోయెల్ పారిస్ బాల్ అందుకున్నాడు. మొదటి రెండు బంతులను డాట్స్ గా వేశాడు. మూడో బంతిని స్మిత్ భారీ సిక్స్ గా మలిచాడు. అలాగే అది నో బాల్ అంటూ ఆన్ ఫీల్డ్ అంపైర్ ప్రకటించాడు. తర్వాత డెలవరీని జోయెల్ వైడ్ వేశాడు. కీపర్ దానిని అందుకోలేకపోవడంతో అది కాస్తా బౌడరీకి చేరింది. ఆ తర్వాత బంతిని జోయెల్ పారిస్ లీగల్ డెలివరీ వేయగా.. దానిని స్మిత్ బౌడరికీ తరలించాడు.
మొత్తానికి ఒకే లీగల్ డెలివరీతో జోయెల్ పారిస్ 16 పరుగులు సమర్పించుకున్నాడు. స్మిత్ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో సిడ్నీ సిక్సర్స్ మొత్తం 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగలిగింది. ఛేజింగ్ లో హోబర్ట్ హరికేన్స్ తడబడ్డారు. ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 156 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఈ మ్యాచ్ లో 24 పరుగుల తేడాతో సిడ్నీ సిక్సర్స్ విజయం సాధించింది. 33 బంతుల్లోనే 66 పరుగులు బాదిన స్టీవ్ స్మిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ప్రస్తుతం స్మిత్ ఆల్రౌండ్ ప్రదర్శన చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. స్మిత్ మల్లీ గాడిలో పడ్డాడంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
15 runs off one legal delivery! 😵💫
Steve Smith’s cashing in once again in Hobart 🙌#BucketBall #BBL12 pic.twitter.com/G3YiCbTjX7
— KFC Big Bash League (@BBL) January 23, 2023