జాస్ప్రిత్ బుమ్రా… భారత క్రికెట్‌లో ఈ పేరు ఒక సంచలనం. ఐపీఎల్ నుంచి టీమిండియాలో స్థానం సంపాదించి డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అన్న పేరు గాంచిన క్రికెటర్ బుమ్రా. టీమిండియా కష్టాల్లో ఉన్నా, వికెట్ల కోసం ఎదురుచూస్తున్నా, కెప్టెన్ చూపు బుమ్రావైపే. బుమ్రా ఓవర్ తీసుకుంటే వికెట్ తప్పకుండా వస్తుంది అన్న క్రేజ్‌ను సాధించాడు. బుమ్రా పెళ్లి చేసుకున్నాక గాడి తప్పాడు అని టీమిండియా అభిమానులు కాస్త గుర్రుగానే ఉన్నారు. వారి కోపాన్ని వెళ్లగక్కడానికి లార్డ్స్ వేదికగా తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఆ అవకాశాన్ని ఇచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు 17 నోబాల్స్ వేస్తే అందులో 13 మన బుమ్రా ఖాతాలోనివే. ఇంకేముంది ట్విట్టర్ వేదికగా టీమిండియా అభిమానులు చలోక్తులు, విసుర్లతో చెలరేగిపోయారు. అవి ఏ రేంజ్‌లో ఉన్నాయో మీరు ఓ లుక్కేయండి.
Jasprit Bumrah if no ball was an Olympic sport. pic.twitter.com/o8sbfLNF75
— Heisenberg ☢ (@internetumpire) August 14, 2021
10 ball Bumrah over, the impact of The Hundred is phenomenal #ENGvIND
— weCricket (@wecricket_) August 14, 2021
Bumrah has scored more runs for England than Rahane, Pujara combined for India.
— Manya (@CSKian716) August 14, 2021
Four no-balls in an over in Test cricket is a rarity!#Bumrah#EngvInd #EngvsInd #IndvEng
— Mohandas Menon (@mohanstatsman) August 14, 2021
Bumrah : No wickets. No balls.
— Daniel Alexander (@daniel86cricket) August 14, 2021
15 minutes taken to complete the last over of Bumrah.
— Johns. (@CricCrazyJohns) August 14, 2021
Get Bumrah in the Hundred with that 10-ball over 😂#ENGvIND
— England’s Barmy Army (@TheBarmyArmy) August 14, 2021
బుమ్రా నోబాల్స్ గురించి చిట్‌చాట్‌లో హోస్ట్ ప్రశ్నించగా, జహీర్‌ఖాన్ సమాధానమిచ్చాడు. ‘అలాంటి సందర్భాలను వివరించడం చాలా కష్టం. అది రన్నప్‌కి రిలేటెడ్‌గా ఉంటుంది. స్టెప్పింగ్ విషయంలో చాలాసార్లు పొరపాట్లు జరగవచ్చు. వికెట్లు దొరకనప్పుడు బౌలర్ కొంత అసహనానికి లోనవుతాడు. అలాంటి సందర్భాలకు బుమ్రా కూడా అతీతుడేమీ కాదు. అలాంటప్పుడు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలనుకుంటారు. ఎక్కువ వేగంగా బాల్ వేయాలనుకుంటారు. అలాంటి సందర్భాల్లో నోబాల్స్ పడే అవకాశం ఎక్కువ’ని జహీర్‌ఖాన్ వివరించాడు.