SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Jacques Kallis Greatest Cricketer Of All Time Full Details

జాక్వెస్ కల్లిస్.. సచిన్‌ని మించిన క్రికెట్ దేవుడి కథ ఇది!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Tue - 27 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
జాక్వెస్ కల్లిస్.. సచిన్‌ని మించిన క్రికెట్ దేవుడి కథ ఇది!

వంద సెంచరీలు.. ఒంటి చేత్తో గెలిపించిన మ్యాచ్‌లు.. ఎన్ని తరాలు గడిచినా.. ఇండియన్‌ క్రికెట్‌ గాడ్‌ అంటే సచిన్‌ టెండూల్కరే. క్రికెట్‌లో ఒక బ్యాటర్‌గా ఆయన సాధించిన ఘనతలు, చేసిన పరుగులు, గెలిపించిన మ్యాచ్‌లు ఆయనను భారత క్రికెట్‌కు దేవుడిని చేశాయి. అయితే బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కలగలిసిన క్రికెట్‌లో.. ఒక్క బ్యాటింగ్‌లోనే దిగ్గజంగా ఎదిగిన సచిన్‌ను క్రికెట్‌ దేవుడిగా కొలిస్తే.. మరి ఆ మూడు విభాగాల్లోనూ అసాధారణ ప్రతిభ కనబర్చి.. ఒక పరిపూర్ణ క్రికెటర్‌గా నిలిచిన ఆటగాడిని ఏమనాలి. కచ్చితంగా అతను కూడా క్రికెట్‌ ఆరాధ్యుడే. బ్యాటింగ్‌ విషయంలో సచిన్‌ను మించి కాకపోయినా.. సచిన్‌కు పోటీ ఇస్తూ.. గొప్ప బ్యాటర్‌గా, బౌలర్‌గా, ఫీల్డర్‌గా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ను కొనసాగించిన ఆ ఆటగాడే.. సాతాఫ్రికా క్రికెట్‌ గాడ్‌ జాక్వెస్‌ కల్లిస్‌.

ఆల్‌రౌండర్‌ అన్న పదానికి రూపం అంటూ ఉంటే అది కల్లిసే. అయితే ఆల్‌రౌండర్లలో కూడా బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌, బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు ఉంటారు. బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ అంటే.. బ్యాటింగ్‌ బాగా చేస్తూ.. బౌలింగ్‌ కూడా మేనేజ్‌ చేయగలరు. అలాగే బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అంటే.. బౌలింగ్‌ పర్ఫెక్ట్‌గా వేస్తూ.. బ్యాటింగ్‌లో కొంతవరకు నెట్టుకోరాగలరు. కానీ.. కల్లిస్‌ అలా కాదు. ఒక నిఖార్సయిన ఆల్‌రౌండర్‌. బ్యాటింగ్‌ చేస్తే.. ఒక సచిన్‌లా! బౌలింగ్‌ చేస్తే.. ఒక మెక్‌గ్రాత్‌లా ఉంటుంది. కల్లిస్‌లోని మరో గొప్ప విశేషం ఏంటంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేయగలడు. వికెట్లు పడిపోతే.. అడ్డుగోడలా నిలబడిపోగలడు. ఒక ఓవర్‌కు 20 రన్స్‌ కొట్టాలన్నా.. బ్యాట్‌ ఝుళిపించగలడు. క్లాసి షాట్స్‌తో ఫోర్లు, విధ్వంసకర బ్యాటింగ్‌తో సిక్సులూ కొట్టడగలడు.

jacques-kallis-greatest-cricketer-of-all-time-full-details

బౌలింగ్‌లోనైతే.. పుట్టినప్పటి నుంచి బౌలింగే ధ్యాసగా, బ్యాటర్‌ను అవుట్‌ చేయడమే లక్ష్యంగా ఉన్న బౌలర్‌ను మించి వేరియేషన్స్‌ చూపిస్తాడు. బౌన్స్‌, ఇన్‌ స్వింగ్‌, అవుట్‌ స్వింగ్‌, స్లోవర్‌ డెలవరీ, యార్కర్‌ ఇలా తన బౌలింగ్‌లో లేని వేరియేషన్‌ అంటూ లేదు. పైగా.. సాధారణ ఆల్‌రౌండర్‌లా నామమాత్రపు పేస్‌ కాదు. బ్యాటర్లను భయపెట్టే వేగం. నిజానికి కల్లిస్‌ టీమ్‌లో ఉన్నాడంటే.. ఆ టీమ్‌ 12 మంది ప్లేయర్లతో బరిలోకి దిగినట్లే లెక్క. ఎందుకంటే.. కల్లిస్‌ అంటే ఒక్కడు కాదు.. ఇద్దరు. ఒక క్లాసిక్‌ బ్యాటర్‌, ఒక వికెట్‌ టేకింగ్‌ బౌలర్‌గా కల్లీస్‌.. టీమ్‌లో ఒకడిగా కనిపించే ఇద్దరు ఆటగాళ్లకు సమానం. చాలా మంది ఆల్‌రౌండర్లలాగా.. ఏదో కొన్ని ఓవర్లు మేనేజ్‌ చేయడం కాదు.. ప్రధాన బౌలర్‌లా తన కోటాను పర్ఫెక్ట్‌గా పూర్తి చేస్తాడు. ఇక ఫీల్డింగ్‌ విషయంలోనూ కల్లిస్‌ తోపే. స్లిప్స్‌లో కల్లిస్‌ క్యాచ్‌ మిస్‌ చేసిన దాఖలాలు చాలా అరుదు.

ఇలా క్రికెట్‌లో ప్రధానమైన మూడు విభాగాల్లోనూ వందకు వందశాతం ఇస్తూ.. 18 ఏళ్ల కెరీర్‌ను అద్భుతంగా కొనసాగించాడు కల్లిస్‌. నిజానికి కల్లిస్‌ ఆడిన సమయం.. సౌతాఫ్రికా క్రికెట్‌కు గోల్డెన్‌ ఎరా. అలాంటి ఆటగాడు.. యుగానికి ఒక్కడే పుడతాడు. ఆఫ్రికన్ల అదృష్టం కొద్ది అతను వారిదేశంలోనే పుట్టాడు. కల్లిస్‌ను బ్యాటర్‌ అనలేం.. బౌలర్‌ అనలేం.. ఆల్‌రౌండర్‌ అనడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే.. అతనో పరిపూర్ణమైన క్రికెటర్‌. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కలగలిపితేనే క్రికెట్‌.. అలానే ఆ మూడింటిలోనూ సత్తా చాటిన కల్లిస్‌ ఒక అద్భుతమైన క్రికెటర్‌. ఒక బ్యాటర్‌గా కల్లిస్‌ సాధించిన రికార్డులు, చేసిన పరుగులు.. ఎంతో మంది పక్కా బ్యాటర్లకు అందని, అందుకోలేనివి ఉన్నాయి. అలాగే బౌలింగ్‌లోనూ అంతే.. కల్లిస్‌ పడగొట్టిన వికెట్ల సంఖ్య.. బౌలింగ్‌ మాత్రమే తెలిసిన చాలా మంది బౌలర్ల వికెట్ల మొత్తాన్ని కలిపినా సరిపోవు. ఫిట్‌నెస్‌ విషయంలోనూ కల్లిస్‌ను కొట్టే క్రికెటర్‌ లేడు. టెస్టు క్రికెట్‌లో క్రీజ్‌లో పాతుకుపోయి ఒక రోజంతా బ్యాటింగ్‌ చేసినా.. మరుసటి రోజు 30 ఓవర్లు వేయగల సామర్థ్యం ఉన్న ఆటగాడు. ఇలాంటి ఒక ఆటగాడు.. క్రికెట్‌ ఆడాడంటే.. చీటికిమాటికి గాయపడే యువ క్రికెటర్లు నమ్మడం కాస్త కష్టమే.

jacques-kallis-greatest-cricketer-of-all-time-full-details

1995లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కల్లిస్‌.. 2013 వరకు కొనసాగాడు. ఈ 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో అతని గణాంకాలు చూస్తే.. ప్రస్తుత క్రికెటర్లకు మైండ్‌బ్లాంక్‌ అవుతుంది. ఎందుకంటే.. కల్లిస్‌ బ్యాటింగ్‌ స్టాట్స్‌ చూస్తే.. అతనో అద్భుతమైన బ్యాటర్‌ అని, అతని బౌలింగ్‌ నంబర్స్‌ చూస్తే.. ఇంత గొప్ప బౌలరా? అని అనిపించకమానదు. బ్యాటింగ్‌ విషయంలో కల్లిస్‌.. సచిన్‌ను మించినోడని అనేందుకు మనకు మనసు రాకపోయినా.. లెక్కలు చూసిన తర్వాత అయినా ఒప్పుకోక తప్పదు. టెస్టుల్లో కల్లిస్‌ యావరేజ్‌.. ది గ్రేట్‌ సచిన్‌ టెండూల్కర్‌ కంటే ఎక్కువ. టెస్ట్‌ క్రికెట్‌లో సచిన్‌ బ్యాటింగ్‌ యావరేజ్‌ 53.78 కాగా.. కల్లిస్‌ది 55.37. ఈ ఒక్క విషయంలో కల్లిస్‌ ఎక్కువైనంత మాత్రమా సచిన్‌ కంటే గొప్ప ఆటగాడు కాలేడు, కానీ.. ఒక ఆల్‌రౌండర్‌గా ముద్రపడిన బ్యాటర్‌ యావరేజ్‌ క్రికెట్‌ గాడ్‌ యావరేజ్‌ కంటే ఎక్కువగా ఉందంటే.. అది చాలా పెద్ద విషయమే. కల్లిస్‌ గర్వంగా చెప్పుకోగల సంగతే.

తన కెరీర్‌లో మొత్తం 166 టెస్టులు ఆడిన కల్లిస్‌.. 280 ఇన్నింగ్స్‌ల్లో 13289 పరుగులు చేశాడు. అందులో 45 సెంచరీలు, 58 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఈ లెక్కలు చూస్తే.. కల్లిస్‌ టెస్టు క్రికెట్‌లో ఒక గొప్ప బ్యాటర్‌ అని కచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. అలాగే వన్డేల విషయానికి వస్తే.. 328 మ్యాచ్‌ల్లో 314 ఇన్నింగ్స్‌ల్లో 44.36 సగటుతో 11579 పరుగులు.. అందులో 17 సెంచరీలు, 86 హాఫ్‌ సెంచరీలు సాధించాడు. ఇక బౌలింగ్‌ లెక్కల గురించి మాట్లాడుకుంటే.. అదో అద్భుతం. ఒక గొప్ప క్రికెటర్‌గా కీర్తించబడేందుకు పై లెక్కలు సరిపోతాయి. కానీ.. కల్లిస్‌ కేవలం బ్యాటర్‌ మాత్రమే కాదు.. పై పేరాల్లో చెప్పుకున్నట్లు అతనో నిఖార్సయిన క్రికెటర్‌. అందుకే.. 166 టెస్టుల్లో 292, 328 వన్డేల్లో 273.. టీ20ల్లోనూ 12 వికెట్లు కల్లిస్‌ సొంతం. టెస్టుల్లో రికార్డులన్ని అంత గొప్పగా ఉన్నా.. యువ క్రికెటర్ల రాజ్యంగా చెప్పుకుంటున్న టీ20 ఫార్మాట్లో కూడా కల్లిస్‌ తన మార్క్‌ను చూపించాడు. 25 ఇంటర్నేషనల్‌ టీ20లు ఆడిన కల్లిస్‌.. 666 పరుగులు చేసి 5 హాఫ్‌ సెంచరీలు చేశాడు. ఐపీఎల్‌, కరేబియన్‌ లీగ్‌, బిగ్‌బాష్‌ లాంటి వాటిల్లోనూ కల్లిస్‌ను హాట్‌కేక్‌ను కొన్నట్టు కొనేవారు.

jacques-kallis-greatest-cricketer-of-all-time-full-details

2012లో శ్రీలంకతో కేప్‌టౌన్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో కల్లిస్‌ తన విశ్వరూపం చూపించాడు. లంక బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. ఏకంగా 224 పరుగులు బాది తన కెరీర్‌లోనే అత్యధిక టెస్ట్‌ స్కోర్‌ను నమోదు చేశాడు. ఆ టెస్టులో 224 పరుగులు చేసి కల్లిస్‌.. బౌలింగ్‌లోనూ 3 వికెట్లు పడగొట్టడమే కాకుండా.. ఏకంగా 6 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇక వన్డే క్రికెట్‌లో 2004 ఫిబ్రవరి 4న వెస్టిండీస్‌తో జరిగిన 5వ వన్డేలో.. కల్లిస్‌ చెలరేగిపోయాడు. 11 ఫోర్లు, 3 సిక్సులతో విండీస్‌ బౌలర్లపై విరుచుకుపడి.. తన కెరీర్‌లోనే వన్డేల్లో హైఎస్ట్‌ స్కోర్‌ 139 బాడేశాడు. ఇలాంటి అద్భుత ఇన్నింగ్స్‌లతో పాటు కల్లిస్‌ ఒంటి చేత్తో గెలిపించిన మ్యాచ్‌లు ఎన్నో ఉన్నాయి. పార్టనర్‌షిప్‌లు నెలకొల్పడంలో కల్లిస్‌ది ప్రత్యేకమైన శైలి. అలాగే కల్లిస్‌ లాంటి ఆల్‌రౌండర్‌ను చూపిస్తే.. లైఫ్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ఇస్తామనే క్రికెట్‌ అభిమానులు కూడా ఉన్నారు.

బ్యాటర్‌గా టన్నుల కొద్ది పరుగులు చేస్తూనే.. బౌలర్‌గా మ్యాచ్‌లు గెలిపించాడు కల్లిస్‌. సచిన్‌ కూడా పార్ట్‌టైమ్‌ బౌలర్‌గా 100కు పైగా వికెట్లు పడగొట్టినా.. కల్లిస్‌ గణాంకాలతో సరిపోవు. అలాగే శ్రీలంక ఆటగాడు జయసూర్య సైతం బౌలింగ్‌లో భారీగానే వికెట్లు పడగొట్టినా.. అతన్ని కూడా పార్ట్‌టైమ్‌ బౌలర్‌గానే పరిగణిస్తారు. కానీ.. ఒక్క కల్లిస్‌ను మాత్రమే బౌలింగ్‌ చేసే సమయంలో డేంజరస్‌ బౌలర్‌గా, బ్యాటింగ్‌ చేసే టైమ్‌లో మ్యాచ్‌ విన్నింగ్‌ బ్యాటర్‌గా చూస్తారు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌ అంటే కల్లిస్‌తోనే మ్యాచ్‌లా ఉండేది. ఇండియా బ్యాటింగ్‌ చేస్తుంటే.. బౌలింగ్‌ వేస్తూ కనిపించేవాడు. ఇండియా బౌలింగ్‌ చేస్తుంటే.. బ్యాట్‌తో రన్స్‌ చేస్తూ.. గంటకొద్ది క్రీజ్‌లో పాతుకుపోయేవాడు. సౌతాఫ్రికా క్రికెట్‌ గురించి ఒక పుస్తకం రాయాల్సి వస్తే.. అందులో అందరి కంటే ఎక్కువ పేజీలు కల్లిస్‌ గురించే నిండిపోతాయి. అంతటి అసాధారణమైన ఆటగాడు కాబట్టే.. ఇప్పటికీ చాలా మంది యువ క్రికెటర్లు కల్లిస్‌ను తమ రోల్‌మోడల్‌గా భావిస్తారు. అందులో పక్కా బ్యాటర్లు ఉంటారు, పక్కా బౌలర్లు ఉంటారు. ఎందుకంటే ఆ రెండింటిలోనూ కల్లిస్‌ గొప్పొడు. ప్రపంచ క్రికెట్‌లో ఎన్ని తరాలు గడిచిపోయినా.. ఎన్ని జట్లు వచ్చినా.. ఆల్‌రౌండర్‌ అంటే కల్లిస్‌ ఫొటో చూపించాల్సిందే.

Tags :

  • Cricket News
  • Jacques Kallis
  • sachin tendulkar
  • south africa
  • SumanTV Cricket Special
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam