ఐపీఎల్ 2023 ప్రారంభానికి అంతా సిద్ధం అయ్యింది. ఇక 2023 ఐపీఎల్ ట్రోఫీని ఎగరేసుకుపోయేది ఆ జట్టే అని జోస్యం చెబుతున్నాడు దక్షిణాఫ్రికా దిగ్గజం, మాజీ బ్యాటర్ జాక్వెస్ కల్లీస్. ఫైనల్ కు వెళ్లేది ఆ రెండు జట్లేనని బల్లగుద్ది చెబుతున్నాడు. మరి ఈసారి ఐపీఎల్ ట్రోఫీ కైవసం చేసుకునే ఆ జట్టు ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.
వంద సెంచరీలు.. ఒంటి చేత్తో గెలిపించిన మ్యాచ్‌లు.. ఎన్ని తరాలు గడిచినా.. ఇండియన్ క్రికెట్ గాడ్ అంటే సచిన్ టెండూల్కరే. క్రికెట్‌లో ఒక బ్యాటర్‌గా ఆయన సాధించిన ఘనతలు, చేసిన పరుగులు, గెలిపించిన మ్యాచ్‌లు ఆయనను భారత క్రికెట్‌కు దేవుడిని చేశాయి. అయితే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కలగలిసిన క్రికెట్‌లో.. ఒక్క బ్యాటింగ్‌లోనే దిగ్గజంగా ఎదిగిన సచిన్‌ను క్రికెట్ దేవుడిగా కొలిస్తే.. మరి ఆ మూడు విభాగాల్లోనూ అసాధారణ ప్రతిభ కనబర్చి.. ఒక పరిపూర్ణ క్రికెటర్‌గా నిలిచిన […]
రెండేళ్ల తరువాత జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ నిలకడగా రాణిస్తున్నాడు. ఇది భారత జట్టుకు ఒకరకంగా మంచిదే. అయితే.. ఈ ప్రదర్శన ఎన్నాళ్ళు కొసాగుంతుందో చెప్పలేం. ఎందుకిలా అంటున్నాం అంటే.. 2016లో టీ20 క్రికెట్లో అరంగేట్రం చేసిన హార్దిక్.. ఆరంభం నుంచీ అదరగొట్టేవాడు. భారత జట్టుకు కపిల్ దేవ్ లా అసలైన ఆల్‌రౌండర్ దొరికాడని అందరూ అనుకున్నారు. అంతలోనే వెన్నెముక సర్జరీతో హార్దిక్ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆ […]