టీమిండియా బ్యాటింగ్ పవర్ చాలా రోజుల తర్వాత కనిపించింది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో పాటు యువ ఆటగాడు ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. చట్టోగ్రామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. కొన్ని ఓవర్ల వరకు బాగానే ఆడింది. ఎప్పుడైతే ఇషాన్ సెంచరీ చేశాడో.. అప్పటినుంచి మనోడు రెచ్చిపోయాడు. డబుల్ సెంచరీ చేసి ఔటయ్యేదాకా బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. బౌండరీలు బాదుతూనే కనిపించాడు. ఇక నిర్ణీత ఓవర్లలో భారత జట్టు 409-8 పరుగులు చేస్తే అందులో సగం రన్స్ ఇషాన్ వే కావడం విశేషం. అయితే తొలి సెంచరీనే డబుల్ సెంచరీగా మార్చిన ఇషాన్ కిషన్.. ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో ఏకంగా 10 సరికొత్త రికార్డులు నమోదు చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాతో మూడో వన్డేలో ఛాన్స్ దక్కించుకున్న ఇషాన్ కిషన్, సెంచరీ చేసేవరకు చాలా నెమ్మదిగా ఆడాడు. 85 బంతుల్లో శతకం చేశాడు. ఆ తర్వాత మాత్రం రెచ్చిపోయాడు. మరో 41 బంతుల్లో అంటే మొత్తంగా 126 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. అతడి ఊపు చూస్తే రోహిత్ శర్మ 264 పరుగుల రికార్డును బ్రేక్ చేస్తాడేమోనని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ 210 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇషాన్ ఔటైపోయాడు. ఇకపోతే వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాటర్ గా ఇషాన్ కిషన్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇతడి కంటే ముందు సచిన్, సెహ్వాగ్, రోహిత్ శర్మ ఈ మార్క్ క్రాస్ చేశారు. వన్డేల్లో మన జట్టు తరఫున అత్యధిక స్కోరు చేసిన వికెట్ కీపర్ కూడా ఇషాన్ కిషన్. అంతకు ముందు ధోనీ(183) పేరిట ఈ రికార్డు ఉంది.
బంగ్లాదేశ్ లో ఆ జట్టుపై 2011లో వాట్సన్(ఆస్ట్రేలియా) 185 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసిన ఇషాన్ కిషన్.. బంగ్లాపై అత్యధిక స్కోరు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. బంగ్లాతో మూడో వన్డేలో 10 సిక్సర్లు బాదిన ఇషాన్ కిషన్.. 2000లో సచిన్, బంగ్లాదేశ్ జట్టుపై 7 సిక్సులు బాదిన రికార్డుని బ్రేక్ చేశాడు. వన్డేల్లో తొలి సెంచరీని అత్యధిక వ్యక్తిగత స్కోరుగా మార్చిన బ్యాటర్ గా ఇషాన్ రికార్డు క్రియేట్ చేశాడు. అంతకు ముందు కపిల్ దేవ్.. తొలి సెంచరీని 175 పరుగులుగా చేసి నాటౌట్ గా నిలిచాడు. 103 బంతుల్లో 150 స్కోరు దాటిన ఇషాన్.. ఫాస్ట్ గా 150 ప్లస్ స్కోరు చేసిన భారత బ్యాటర్ గా ఘనత సాధించాడు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్.. 112 బంతుల్లో 150 ప్లస్ స్కోరు చేశాడు.
2020 జనవరిలో ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ సెంచరీ బాదాడు. మళ్లీ రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు టీమిండియా తరఫున సెంచరీ బాదిన ఓపెనర్ ఇషాన్ కిషన్. బంగ్లాదేశ్ లో అతి చిన్న వయసులో 50 ప్లస్ స్కోరు చేసిన భారత క్రికెటర్ గా ఇషాన్ కిషన్ నిలిచాడు. గంభీర్ తర్వాతి స్థానంలో నిలిచాడు. గంభీర్.. 21 ఏళ్ల 184 రోజుల్లో బంగ్లాలో 50 ప్లస్ చేసిన ఓపెనర్ కాగా.. ఇషాన్ కిషన్.. 24 ఏళ్ల 145 రోజుల్లో ఈ మార్క్ ని క్రాస్ చేశాడు. టీమిండియా లెఫ్ట్ హ్యాండర్స్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా ఇషాన్ కిషన్ రికార్డు క్రియేట్ చేశాడు. 1999 వరల్డ్ కప్ లో గంగూలీ 183 పరుగులు నెలకొల్పిన ఘనతని ఇప్పుడు బ్రేక్ చేశాడు. మరి ఒక్క డబుల్ సెంచరీతో ఇషాన్ ఏకంగా 10 సరికొత్త రికార్డులు నెలకొల్పడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
The celebration from Ishan Kishan on reaching 200 was wholesome!
A ‘Bhangra’ cameo from Virat Kohli! pic.twitter.com/LYS1x1kMeG
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 10, 2022
A knock to remember from Ishan Kishan ✨#BANvIND | https://t.co/SRyQabJ2Sf pic.twitter.com/xh3Es9Jc4X
— ICC (@ICC) December 10, 2022
Literally 𝘋𝘩𝘢𝘨𝘢 𝘬𝘩𝘰𝘭 𝘥𝘪𝘺𝘦 Aaj Ishan Kishan! 👏🏻💥
Becomes the 4th Indian to score 2️⃣0️⃣0️⃣ in Men’s ODIs 🏏💙#OneFamily #BANvIND @ishankishan51 pic.twitter.com/QX88IiViob
— Mumbai Indians (@mipaltan) December 10, 2022