ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ ఆడేందుకు దుబాయ్ వెళ్లిన టీమిండియా.. మ్యాచ్ కి ముందు హోటల్ ప్రాంగణంలో రవీంద్ర జడేజాని నీటి సంబంధిత ట్రైనింగ్ తీసుకోమన్నారట. స్కై-బోర్డ్ లాంటి యాక్టివిటీతో సాహసం చేసే ప్రయత్నం చేసి దెబ్బ తగిలించుకున్నాడు జడేజా. జారి పడడంతో మోకాలు మెలి తిరిగింది. అది సర్జరీకి దారి తీసింది. నిజానికి ఈ సాహసం అనవసరం, ట్రైనింగ్ లో లేనే లేదు. గాయం కారణంగా జడేజా.. ముంబైలోని హాస్పిటల్ లో బీసీసీఐ కన్సల్టెంట్, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పార్దివాలా సమక్షంలో సర్జరీ చేయించుకున్నాడు. అయితే ఇప్పుడు జడేజాపై బీసీసీఐ నిప్పులు చెరుగుతుంది. ముఖ్యమైన, ప్రతిష్టాత్మకమైన టీ20 ప్రపంచ కప్ ఉందన్న ఆలోచన లేకుండా ఈ స్కై-బోర్డు యాక్టివిటీ అవసరమా అంటూ బీసీసీఐ ప్రశ్నలు సంధిస్తోంది. టీమిండియాలో అత్యంత విలువైన ఆటగాడు ఇలాంటి పనులు చేయొచ్చా? అంటూ మండిపడినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
జడేజా త్వరలో కోలుకుని తిరిగి టీమ్ లో చేరతానని చెప్పినప్పటికీ.. అతనికి తగిలిన గాయం అంత చిన్నది కాదని తెలుస్తోంది. గాయం కూడా విచిత్రంగా ఉందని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచ కప్ లో కూడా జడేజా ఉండదని వార్తలు వస్తున్నాయి. దీంతో జడేజాని రీప్లేస్ చేయడం టీమిండియాకి భారమనే చెప్పాలి. ఎందుకంటే ఆసియా కప్ టోర్నమెంట్ లో పాకిస్తాన్ తో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్ లో రెండు ఓవర్లు బౌలింగ్ చేసి అందరి కంటే చాలా తక్కువ పరుగులు ఇచ్చాడు. అంతేకాకుండా సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా కంటే ముందు బ్యాటింగ్ కి వచ్చి 29 బంతులకి 35 పరుగులు చేశాడు. అలాంటి జడేజా.. గాయం కారణంగా ఆసియా కప్ నుండి దూరం కావాల్సి వచ్చింది.
హాంగ్ కాంగ్ తో జరిగిన మ్యాచ్ లో జడేజా ఆడనప్పటికీ.. 4 ఓవర్లకి ఒక వికెట్ కి కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి.. ఒకప్పుడు బౌలర్ల కంటే అత్యంత పొదుపుగా పరుగులు ఇచ్చే బౌలర్ గా పేరుంది జడేజాకి. ఒకవేళ జడేజాకి గాయం అవ్వకుండా ఉండి ఉంటే పాకిస్తాన్ తో జరిగిన రెండో మ్యాచ్ లో జడేజా ఆడేవాడు. జడేజా ఆడి ఉంటే భారత్ గెలిచేదేమో. కానీ పాకిస్తాన్ తో ఆడిన మ్యాచ్ లో 5 వికెట్లు తేడాతో భారత్ ఓడిపోయింది. ఈ కారణంగా ఆసియా కప్ ఫైనల్ కి చేరుకోలేకపోయింది. దీనికి జడేజా లేకపోవడం కూడా ఒక కారణమని ఫ్యాన్స్ అండ్ బీసీసీఐ అభిప్రాయపడుతోంది. ఇక ఆస్ట్రేలియా టూర్ నాటికి కూడా జడేజా కోలుకోవడం కష్టమేనని బీసీసీఐ భావిస్తోంది. దీంతో జడేజా లేకుండా ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ కష్టమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే బీసీసీఐ జడేజా గాయం పట్ల సీరియస్ అవుతున్నట్లు వార్తలువ్ రాస్తున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.