టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. దాదాపు మూడేళ్ల తర్వాత ఇంటర్నేషనల్ సెంచరీ చేశాడు. ఫ్యాన్స్ అయితే నిన్నటి నుంచి పండగ చేసుకుంటున్నారు. తెగ స్టేటస్ లు పెడుతున్నారు. సహచర క్రికెటర్స్ విరాట్ ని ప్రశంసిస్తూ ట్వీట్స్ వేస్తున్నారు. ఇక మాజీలు మాత్రం కోహ్లీ.. బ్యాటింగ్ పొజిషన్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. అఫ్ఘనిస్థాన్ జట్టుతో గురువారం జరిగిన ఆసియాకప్ మ్యాచులో కోహ్లీ ఓపెనర్ గా వచ్చాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మూడేళ్లయింది సెంచరీ చేసి. ఫ్యాన్స్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ కోరిక కాస్త.. ఈ మ్యాచుతో తీరిపోయింది. దీంతో కొత్త వాదన తెరపైకి వచ్చింది. ఇక టీ20ల్లో కోహ్లీని ఓపెనర్ గా పంపిస్తే బాగుంటుందని పలువురు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మాజీలు మాత్రం మరోలా తమ ఓపీనియన్ బయటపెట్టారు. ఈ వాదనపై తొలుత రెస్పాండ్ అయిన గౌతమ్ గంభీర్.. కోహ్లీ, మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలని అన్నాడు. ఇదే విషయమై మాట్లాడిన పుజారా కూడా సేమ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఓపెనర్స్ గా రోహిత్-రాహుల్ జోడీ బాగుందని, అందుకే విరాట్ మూడో స్థానంలో రావడాన్నే కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ పొజిషన్ గురించి ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవని చెప్పాడు. రాబిన్ ఉతప్ప కూడా ఇదే మాట్లాడుతూ.. నంబర్ 3లో కోహ్లీ మాస్టర్ అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరి మాజీల వ్యాఖ్యల గురించి కోహ్లీ ఓపెనింగ్ వార్తలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చేయండి. ఇదీ చదవండి: కింగ్ కోహ్లీ సెంచరీ చేస్తే రికార్డుల వర్షమే! 1 కాదు, 2 కాదు.. ఏకంగా 12 రికార్డులు