ఈ మధ్య ఐపీఎల్ లో యువ క్రికెటర్లు తమ సత్తా చాటుతున్నారు. గత సీజన్ విషయానికొస్తే వెంకటేష్ అయ్యర్, రుతరాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఇక ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో సైతం వీరు మెరుపులు మెరిపిస్తున్నారు. రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటికే హ్యాట్రిక్ సెంచరీలు సాధించి సెలక్టర్స్ ద్రుష్టిని ఆకర్షించాడు.
ఇక ఈ ట్రోఫీలో తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ కూడా తన సత్తా చాటుతున్నాడు. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన గ్రూప్-ఏ లీగ్ మ్యాచ్‌లో.. భరత్ 109 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్స్‌లతో అజేయంగా 161 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్ లో భరత్ వీరోచితమైన బ్యాటింగ్ కారణంగా ఆంధ్ర జట్టు 30 పరుగుల తేడాతో విజయం సాధించడం విశేషం. గత ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ తరుపున బరిలోకి దిగిన కేఎస్ భరత్ అద్భుతమైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు.
161 off 109 balls by KS Bharat Today in #VijayHazareTrophy
Video – @KonaBharat #CricDomestic pic.twitter.com/HZG7NvbNo8
— 🏏CricDomestic🏏 (@_CricDomestic) December 12, 2021
ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రసవత్తర పోరులో ఆఖరి బంతికి సిక్సర్ బాది జట్టుకు విజయాన్ని అందించడంతో భరత్ పేరు ఒక్కసారిగా మారు మోగింది. ఇక భరత్ ఫామ్ ద్రుష్ట్యా అతని కోసం ఐపీఎల్ టీమ్స్ పోటీ పడడటం ఖాయంగా కనిపిస్తోంది. అద్బుతమైన బ్యాటింగ్ తో పాటు కీపర్ గా కూడా రాణించ గల సత్తా ఉన్న భరత్ కి మరో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. త్వరలోనే ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుంది. ఈ ఆక్షన్ లో భరత్ పై కోట్ల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.