అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఐపీఎల్ 2022 సీజన్ సాదాసీదాగా ఆరంభమైంది. గత ఏడాది ఫైనలిస్ట్‌ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ ఎలాంటి మెరుపులు లేకుండానే సాఫీగా సాగిపోయింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేక డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) సాధారణ స్కోరుకే పరిమితం కాగా.. ఆ తర్వాత కేకేఆర్ జట్టు ఎలాంటి తడబాటు లేకుండా అలవోకగా లక్ష్యాన్ని చేధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ధోనీ ఆరెంజ్ కలర్ కీపింగ్ గ్లోవ్స్‌తో బరిలోకి దిగడం చర్చనీయాంశమైంది.
2004లో అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన ధోని .. భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడినప్పుడు ఆరెంజ్ కలర్ కీపింగ్ గ్లోవ్స్ ధరించాడు. కెప్టెన్‌గా తన తొలి టీ20 మ్యాచ్‌లో ఈ కలర్ కీపింగ్ గ్లోవ్స్‌నే ఉపయోగించాడు. ఆ తర్వాత సాధారణ గ్లోవ్స్ వాడిన ధోనీ మళ్లీ ఇన్నాళ్లకు ఆరెంజ్ గ్లోవ్స్‌తో బరిలోకి దిగడం విశేషం. అయితే ధోనీ ఇలా ఆరెంజ్ గ్లోవ్స్‌తో బరిలోకి దిగడంపై అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: రాయుడు రనౌట్ కాకుంటే పరిస్థితి వేరుగా ఉండేది! జడేజాపై CSK ఫ్యాన్స్ ఫైర్ధోనీ.. కెరీర్‌లో చివరి ఐపీఎల్ ఆడుతాన్ననని భావించాడని అందుకే ఆరెంజ్ కీపింగ్ గ్లోవ్స్ ధరించాడని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ సీజన్‌లో కెప్టెన్ గా కాకుండా.. కేవలం ఆటగాడిగా కొనసాగుతున్నందున ఈ గ్లోవ్స్ ధరించి ఉంటాడని కామెంట్ చేస్తున్నారు. కీపింగ్‌లో బాగా రాణించాడని ధోనీకి.. బీసీసీఐ ఆరెంజ్ గ్లోవ్స్ ఇచ్చిందని ఇంకొందరూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ధోనీ ఆరెంజ్ గ్లోవ్స్ ధరించడం హాట్ టాపిక్ గా మారింది.
MSDhoni With His Orange Gloves 💥#MSDhoni | #IPL2022 | #CSKvKKR | #Dhoni pic.twitter.com/Wq7Ej2afbS
— Riteesh MSDian ™ (@riteeshtweets) March 26, 2022
కెప్టెన్‌గా బాధ్యతలు వదిలేశాక తొలి మ్యాచ్‌లోనే ధోనీ సత్తా చాటాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో అజేయ హాఫ్ సెంచరీ(38 బంతుల్లో 50 పరుగులు)తో రాణించాడు. దాంతో పెద్ద వయసులో హాఫ్ సెంచరీ సాధించిన భారత ఆటగాడిగా ధోనీ అరుదైన ఘనతను సాధించాడు. ప్రస్తుతం ధోనీ వయసు 40 ఏళ్ల 262 రోజులు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రికార్డును అధిగమించాడు. రాహుల్ ద్రవిడ్ 40 ఏళ్ల 116 రోజుల వయసులో ఈ ఘనతను అందుకున్నాడు.
Thala back in Orange Gloves ♥️@msdhoni #Thala #CSK #IPL2022 #CSKvsKKR pic.twitter.com/sXMDIytVdH
— அரவிந்த் வீரமணி ✨ (@Aravindvicky_) March 26, 2022
ఇది కూడా చదవండి: సచిన్ మనసు గెలుచుకున్న KKR ప్లేయర్! ఏకంగా ధోనితో పోలిక
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి కేకేఆర్ బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఎంఎస్ ధోనీ (38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 50 నాటౌట్) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం కోల్‌కతా 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 133 పరుగులు చేసింది. రహానే ( 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 34 బంతుల్లో 44) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
My niece going to watch her first IPL game 🥺 She’s a huge Dhoni fan ❤️#IPL2022 #CSKvKKR pic.twitter.com/hvU69DxM3c
— Sana Allana (@SanaShariffHai) March 26, 2022
Well played by @msdhoni.
He started slowly but used his experience and a combination of composure, aggression and common sense to get @ChennaiIPL to where they are.Their bowlers will have to bowl exceedingly well to defend the total on this pitch. #CSKvKKR pic.twitter.com/BmfKRyDJOd
— Sachin Tendulkar (@sachin_rt) March 26, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.