విజయ్ శంకర్.. ‘త్రీడీ ప్లేయర్’ గా ఈ పేరు అందరకి సుపరిచితమే. ఈ బిరుదు ఎవరిచ్చారో కానీ, ఆ త్రీడీ ఆట మాత్రం చూడట్లేము. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మొదటి మ్యాచులో విఫలమైన విజయ్ శంకర్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. దీంతో ఈ తమిళనాడు ప్లేయర్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు అభిమానులు విజయ్ శంకర్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు.
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 బంతుల్లో 4 పరుగులు చేసిన దారుణంగా విఫలమైన శంకర్.. బౌలింగ్ కూడా చేయలేదు. అయినా అతనికి రెండో మ్యాచ్‌లో అవకాశం ఇవ్వడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ డౌన్ బ్యాటర్ గా బరిలోకి దిగిన శంకర్.. 20 బంతుల్లో 13 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మొదటి నుంచి బంతులను ఎదుర్కోవడంలో తెగ ఇబ్బంది పడిన విజయ్ శంకర్.. బౌండరీలు కొట్టలేక ఒత్తిడికి గురై వికెట్ సమర్పించుకున్నాడు. దాంతో నెటిజన్లు ఈ త్రీడీ ప్లేయర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
3D player 😭 #VijayShankar pic.twitter.com/d0OVjkkBe7
— Sahil 👑 (@Umariazkingdom) April 2, 2022
ఇది కూడా చదవండి: దుమ్మురేపిన తెలుగోడు! SRH పై ట్రోలింగ్!
ఏం ఆడకపోయినా అవకాశాలు మాత్రం శంకర్‌కు దక్కుతాయని, అది ఐపీఎల్ అయినా.. టీమిండియాకైనా.. అదృష్టం అంటే అతనిదేనని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. అసలు అతను ఏం ఆడుతాడని, ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేశారని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ శంకర్ త్రీడీ ఆట కోసం గత మూడేళ్లుగా ఎదురు చూస్తున్నామని.. ఈ జీవితంలో అతని త్రీడీ ఆటను చూస్తామో లేదోనని అంటూ సెటైర్లు వేస్తున్నారు.
Vijay Shanker proving a point since last @IPL#TATAIPL #staraikelungal #STARAIKELLUNGAL #hotstar #LSGvsGT #vijayshankar pic.twitter.com/G4Jqro37Rf
— Saravana Kumar (@saran_18) March 29, 2022
Perfect Memes For @vijayshankar260 #VijayShankar #kedarjadhaw #IPL2022 #TATAIPL2022 #gtvsdc #gujrattitans pic.twitter.com/vYpMfyCgUe
— azharali (@azharal57528542) April 3, 2022
#vijayshankar at no.3
Meanwhile what he needs to play well….Pehli dhaar ki…. #LSGvsGT #GTvsLSG #HardikPandya #KLRahul #Oscars #IPL2022 #IPL pic.twitter.com/yHFoCkJrXx
— Anup Nair (@anup_s_nair) March 28, 2022
Lord Vijay shankar #3D #VijayShankar #SMAT2021 #SMATFinal pic.twitter.com/DvzCBFVCJw
— READY TO RISE 🦅🦅🦅🦅 (@Sunrisers_Hyd) November 23, 2021
ఇది కూడా చదవండి: SRHలో కొత్త వివాదం! ఆటగాళ్ల నిరసన.. రంగంలోకి BCCI