ఐపీఎల్ 2022 సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ప్రారంభించింది. గత సీజన్ పాయింట్ల పట్టికలో అట్టడుగుస్థానంలో ఉన్న SRH.. కనీసం ఈ సీజన్‌లోనైనా మంచి ప్రదర్శన చేస్తుందని SRH ఫ్యాన్స్ భావించారు. కానీ సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే దారుణంగా విఫలం అయింది SRH టీమ్. మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 61 పరుగుల భారీ తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి SRH కెప్టెన్ విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకోవడంతో SRH గెలుపు ఖాయం అనుకున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్‌లలో ఛేజింగ్ చేస్తున్న టీమ్స్ విజయం సాధించాయి.
కానీ ఈ సెంటిమెంట్‌ను SRH బ్రేక్ చేసింది. ఈ మ్యాచ్‌లో SRH బౌలర్లు ధారళంగా పరుగులు ఇచ్చారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన SRH సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్‌ను బెంబేలెత్తించాడు. ఇన్, అవుట్ స్వింగర్లతో నిప్పులు చెరిగాడు. భువీ బౌలింగ్‌ను ఎదుర్కొవడంతో ఇబ్బంది పడ్డ.. బట్లర్ ఐదో బంతికి స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. దీంతో రాజస్థాన్ సున్నా పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కానీ అనూహ్యాంగా అది నో బాల్‌గా అంపైర్ ప్రకటించడంతో బట్లర్ బతికి పోయాడు. అంతవరకు మంచి లయలో బౌలింగ్ చేస్తున్న భువీ అనవసరంగా నో బాల్ చేశాడని SRH ఫ్యాన్స్ సోషల్ మీడియా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.భువీ ఆ బాల్‌ను నోబాల్ వేయకుంటే.. SRH పరిస్థితి వేరుగా ఉండేదని అంటున్నారు. అప్పటికే ఇబ్బంది పడుతూ.. ఫామ్‌లో లేనట్లు ఉన్న బట్లర్‌ను అవుట్ చేసి ఉంటే.. రాజస్థాన్ టీమ్ మానసిక పరిస్థితి మారిపోయేదని.. అంత స్కోర్ చేసి ఉండేది కాదని క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. దీంతో భువీ వేసిన నోబాల్‌తోనే మ్యాచ్ స్వరూపం మారిపోయిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: గంటకు 155 కి.మీ. వేగంతో SRH బౌలర్ బౌన్సర్లు!
Not the note we wanted to begin on. We will come back stronger. #SRHvRR #TATAIPL #OrangeArmy #ReadyToRise pic.twitter.com/KUaaXFWCJ6
— SunRisers Hyderabad (@SunRisers) March 29, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.