ఐపీఎల్ 2022 ప్రారంభం కావడానికి గంటల సమయం మాత్రమే మిగిలివుంది. ఈ నెల 26న వాంఖడే వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్‌తో లీగ్ ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. కాగా ప్రాక్టీస్‌లో భాగంగా సన్‌రైజర్స్ ఆటగాళ్లు రెండు జట్లు(కేన్ విలియమ్సన్ టీంగా, భువనేశ్వర్ కుమార్ టీం)గా విడిపోయి మ్యాచ్ ఆడారు. ప్రాక్టీస్ మ్యాచ్‌కు సంబంధించిన వివరాలను సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేస్తూ.. యూట్యూబ్‌లో లైవ్ టెలికాస్ట్ పెట్టింది. కాగా ఈ మ్యాచ్‌లో కేన్ మామ టీంపై భువనేశ్వర్ కుమార్ టీం బంపర్ విక్టరీ సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన కేన్ విలియమ్సన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు చేసింది. ఓపెనర్లు కేన్ విలియమ్సన్, ప్రియమ్ గార్గ్ శుభారంభాన్ని అందించారు. 10 ఓవర్లు ముగిసే 2 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసిన విలియమ్సన్ జట్టు.. 16 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. భువి టీం బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేన్ మామ టీం చివరి 4 ఓవర్లలో 32 పరుగులు మాత్రమే చేసింది. చివరికి 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.
Are you ready for some fireworks from @tripathirahul52 and @ABDULSAMAD___1? 👀
Watch Live on our YouTube channel now! https://t.co/TKg2ju0WW8…
Team Kane: 63/2(10) #OrangeArmy #ReadyToRise #TATAIPL
— SunRisers Hyderabad (@SunRisers) March 21, 2022
.@IamAbhiSharma4 and @rsamarth7 will begin the chase of 147 for Team Bhuvi.
Watch Live: https://t.co/l5AVg9XgkI#OrangeArmy #ReadyToRise #TATAIPL
— SunRisers Hyderabad (@SunRisers) March 21, 2022
అనంతరం.. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భువి టీం మరో 5 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. నికోలస్ పూరన్ 30 బంతుల్లోనే 45 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ఆర్ సమర్థ్ టీంకు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరి తొలి వికెట్‌కు 5 ఓవర్లలోనే 51 పరుగులు చేసింది. దీంతో 10 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 94 పరుగులతో భువి టీం పటిష్ట స్థితిలో నిలిచింది. మొత్తంగా మరో 5 ఓవర్లు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
NickyP’s fiery innings of 45(30) has taken his team past the target!
Team Bhuvi: 147/4(15)
Watch: https://t.co/l5AVg9XgkI#OrangeArmy #ReadyToRise #TATAIPL
— SunRisers Hyderabad (@SunRisers) March 21, 2022
స్కోర్ వివరాలు:
కేన్ విలియమ్సన్ టీం: 146-6
భువనేశ్వర్ కుమార్ టీం: 147-4