ఈ సీజన్‌లో కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగినా ఆర్సీబీ జట్టు తలరాత మాత్రం మారలేదు. ముఖ్యంగా వారి బ్యాడ్ లక్ మాత్రం వారిని వెంటాడుతూనే ఉంది. ఆర్సీబీ 205 పరుగుల భారీ స్కోర్ సాధించి కూడా తమ తొలి మ్యాచ్ లో ఓడిపోయింది. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్, భీకరమైన ఫ్యాన్ బేస్, టీమ్ అంతా స్టార్ ఆటగాళ్లు, కోరింది సమకూర్చే యాజమాన్యం.. ఇన్ని ఉన్నా బెంగుళూరు జట్టుకి మాత్రం ఐపీఎల్ కప్ కొట్టాలన్న కల.. కలలానే మిగిలిపోయింది. ప్రతి సీజన్ లో వారిని దురదృష్టం వెంటాడుతూనే ఉంది. మరి.. దీనికి కారణం ఏమిటి అంటే.. ఓ శాపం అంటూ నెటిజన్స్ కొత్త వాదన తెరపైకి తెచ్చారు. మరి.. బెంగుళూరు జట్టుని వెంటాడుతున్న ఆ శాపం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆర్సీబీకి మొదట్లో ప్రముఖ వ్యాపార వేత్త విజయ్ మాల్యా ఓనర్‌గా ఉన్నారు. 2008లో 111 బిలియన్ డాలర్లకు ఆయన ఆర్సీబీ ఫ్రాంచైజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత చాలా కాలం ఆయన ఆర్సీబీ డైరెక్టర్‌గా కొనసాగారు. అనుకోని కారణాల వల్ల 2016 ఫిబ్రవరి 25న ఆయన ఆ పదవికి, ఆర్సీబీ ఓనర్ కంపెనీ అయిన యునైటెడ్ స్పిరిట్స్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. దీంతో 2016 తర్వాత ఆర్సీబీ ఆయన కంట్రోల్ నుంచి యునైటెడ్ స్పిరిట్స్ టీమ్ చేతికి వచ్చింది. మాల్యా చైర్మన్‌గా ఉన్న సమయంలో ఆర్సీబీ టీమ్‌కు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా ఉన్న అమ్రిత్ థామస్ ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. అంటే ఇప్పుడు ఆర్సీబీ జట్టుకి ఆయనే బాస్.విజయ్ మాల్యా చేసిన ఆర్థిక నేరాలు మన దేశాన్ని ఎంతో దెబ్బతీశాయని.. మన దేశంలో బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయారనే సాధారణ ప్రజలు సైతం బలంగా విశ్వసిస్తున్నారు. అంతే కాకుండా.. దోచుకున్న అక్రమ డబ్బుతోనే మాల్యా ఆర్సీబీ ఫ్రాంచైజ్‌ను సొంతం చేసుకున్నారని చాలా మంది నమ్ముతారు. ఇందులో నిజం ఎంత అన్నది పక్కన పెడితే.., అప్పట్లో మాల్యా విలాసాలు చూసి ఇలాంటి వార్తలు పుట్టుకొచ్చాయి. ఇలా.. విజయ్ మాల్యా కారణంగా చాలా మంది ఆర్సీబీ జట్టుని ద్వేషిస్తూ వచ్చారు. ఇలా ఆర్సీబీపై నరదిష్టి పడిందని, ప్రజల శాపనార్థాలే ఆర్సీబీని వెంటాడుతున్నాయని కొంతమంది భావిస్తున్నారు.
ఇప్పుడు ఆర్సీబీ ఓనర్‌గా మాల్యా తప్పుకున్నా.. ఇప్పటికీ ఆర్సీబీ ఓవర్ ఎవరంటే చాలా మంది మాల్యా పేరే చెబుతారు. విజయ్ మాల్యా ఆర్సీబీకి ఓనర్ అనే బలమైన ముద్ర ఇంకా చెరిగిపోలేదు. అందుకే ప్రజల్లో ఆర్సీబీపై ఒక రకమైన కోపం ఉందనేది వారి వాదన. దేశానికి ద్రోహం చేసిన వ్యక్తి పెట్టిన సంస్థ కనుక.. ఆర్సీబీకి దరిద్రం ఇలా పట్టుకుందని, అందుకే ఎన్ని మార్పులు చేసినా.. ఎంత మంచి ఆటగాళ్లను పెట్టుకున్నా.. ఆర్సీబీ తలరాత మారట్లేదని కొంతమంది జాతీయవాదులు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఆటలో ఇలాంటి మూఢ నమ్మకాలకు చోటు లేకున్నా.. ప్రస్తుతం ప్రజల్లో నానుతున్న మాట మాత్రం ఇదే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయానలు కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: అతి చవగ్గా కింగ్ ఫిషర్ హౌస్‌ను కొనేసిన హైదరాబాద్ రియాల్టీ సంస్థ!..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.